James Cameron- SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘#RRR’ చిత్రం ఇప్పటికి సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామి ని మరిచిపోకముందే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ దక్కించుకోవడం ని చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్ కి వెళ్లిందో అర్థం అవుతుంది.

ఈమధ్యనే ఈ ‘నాటు నాటు’ పాటని కంపోజ్ చేసినందుకు గాను ప్రపంచం లోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ‘కీరవాణి’ కి దక్కింది..ఇప్పుడు రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ క్రిటిక్స్ అవార్డు కూడా ఈ సినిమా దక్కించుకుంది..’ఉత్తమ చిత్రం’ గా ఈ సినిమాకి అవార్డు దక్కింది..రాజమౌళి స్వయంగా ఈ అవార్డు ని అందుకున్నాడు..ఈ ఫంక్షన్ కి జేమ్స్ కెమరూన్ మరియు స్పీల్ బర్గ్ వంటి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా హాజరయ్యారు.
టైటానిక్ మరియు అవతార్ సిరీస్ వంటి వెండితెర అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్ తో రాజమౌళి చాలాసేపటి వరకు చర్చించాడు..జేమ్స్ కెమరూన్ కి #RRR చిత్రం ఎంతగానో నచ్చిందని..ఇప్పటికే #RRR సినిమాని ఆయన రెండు సార్లు చూసి తన భార్య ‘సుజీ’ ని కూడా చూడమని సజెస్ట్ చేశాడంటూ రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్నీ తెలియచేసాడు..అంతే కాదు రాజమౌళి ని ఆయన ‘నువ్వు ప్రపంచం లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్’ వి అని కూడా సంబోదించాడట.

ఇవన్నీ విన్న తర్వాత రాజమౌళి ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..రాజమౌళి ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ కాదు..పాన్ వరల్డ్ డైరెక్టర్..#RRR తర్వాత ఆయన మహేష్ తో చెయ్యబోతున్న సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడట..దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది..ఈ ఏడాది చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది.