
Gastric Problems: ఇటీవల కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. కడుపు ఉబ్బరం, పుల్లటి తేన్పులు వంటి వాటితో జనం నిత్యం వేగలేకపోతున్నారు. దీంతో కడుపులో నిండిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఏం తినాలనిపించదు. పొట్ట ఉబ్బరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మనం తిన్న ఆహారాలు జీర్ణం కాకపోతే ఎసిడిటి సమస్య వస్తుంది. దీని వల్ల ఏం తినాలనిపించదు. తాగాలనిపించదు. పొట్ట బరువుగా ఉంటుంది. అదో రకంగా అనిపిస్తుంది. దీనికి కారణాలు లేకపోలేదు. మన జీవనశైలియే మనకు ఇలాంటి బాధలు కలిగేలా చేస్తుంది. అయినా మనం మారడం లేదు. త్వరగా జీర్ణం అయ్యేవి తీసుకోమంటే నూనెలు వాడిన వస్తువులను తీసుకుంటున్నాం. ఫలితంగా లివర్ వాటిని అరిగించేందుకు నానా తంటాలు పడుతోంది. అయినా కుదరడం లేదు. తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మనకు ఇలాంటి సమస్యలు రావు.
ఏం తినాలి?
త్వరగా జీర్ణమయ్యే ఆహారాల్లో ఆకుకూరలు నెంబర్ వన్. తరువా కూరగాయలు, పండ్లు వస్తాయి. ఇవి కాకుండా ఉదయం లేవగానే పూరీలు, బజ్జీలు, పరోటా, వడ లాంటి వాటిని తీసుకోవడం వల్ల కడుపులో ఇబ్బందిగా అనిపించడం సహజమే. అదే పండ్లు అయితే డైకెక్టుగా రక్తంలోకి వెళ్తాయి. దీంతో లివర్ కు పని ఉండదు. అది విశ్రాంతి తీసుకోవచ్చు. ఉడికించినవి తీసుకుంటే లివర్, ఉడకనివి తింటే రక్తంలోకి వెళ్తాయి. అందుకే మనం తీసుకునే ఆహారాలను బట్టే మనకు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఏర్పడతాయని తెలుసుకోవాలి.
వెల్లుల్లితో..
మన కడుపులో ఏర్పడే గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేయడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. భోజనానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు తినడంతో గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. వెల్లుల్లిలో అంతటి మహత్తర శక్తి దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కడుపులో యాసిడ్స్ ను తొలగించుకునేందుకు అల్లం సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. గ్యాస్ సమస్య లేకుండా చేయడంలో అల్లం కూడా ఎంతో దోహదపడుతుంది.
పుదీనా
భోజనం చేసిన తరువాత పుదీనాతో చేసిన టీని తాగితే తేన్పులు సమస్య ఉండదు. పుదీనా గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతుంది. నరాల బలహీనతలను కూడా దూరం చేస్తుంది. పుదీనాతో పచ్చడి చేసుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్నా పుదీనా గ్యాస్ సమస్యలకు మంచి ఉపయోగకారిణిలా పనిచేస్తుంది. భోజనం చేసిన తరువాత జీర్ణశక్తి కోసం సోంపు గింజలను తినడం కామనే. ఇందులో కడుపు ఉబ్బరాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. ఇవి పేగులో గ్యాస్ ను సులభంగా బయటకు పంపడంలో సాయపడుతుంది.
కొత్తిమీర రసంతో..
కొత్తిమీర రసం తాడం వల్ల కూడా గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. కడుపు ఉబ్బరం నుంచి బయటపడొచ్ు. పొట్ట నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. తులసి ఆకులు కూడా గ్యాస్ సమస్యకు మంచిగా పనిచేస్తుంది. తులసిలో ఆరోగ్య కరమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. రోజు పరగడుపున రెండు మూడు తులసి ఆకులు తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు పోతాయి. ఇలా మన ఇంటి ఆవరణలో దొరికే వాటిలోనే బోలెడు సుగుణాలు దాగి ఉన్నాయి. కానీ మనం వాటిని సరిగా వాడుకోవడం లేదు. ఫలితంగా గ్యాస్ సమస్యలకు నిలయంగా మారుతున్నాం.

గోరువెచ్చని నీటిలో..
కడుపు ఉబ్బరం సమస్య ఉన్నట్లయితే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. నిమ్మరసం కూడా మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే అంశాల్లో ఒకటి కావడం గమనార్హం. ఇలా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే జీర్ణ సమస్యలను దూరం చేసుకోవడంలో మనకు ఎన్నో దారులు కనిపిస్తాయి. వాటిని మనం అనుసరించి గ్యాస్ సమస్యలు లేకుండా చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు