Coriander Benefits: మన వంటకాల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. కూరల్లో ఇది వేసుకోకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. అందుకే మన ఆహారాల్లో కొత్తిమీరను ప్రధానంగా చేసుకోవడం మంచిదే. కొత్తిమీరతో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. టైప్ 2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే ఔషధంగా ఇది దోహదపడుతుంది. కొత్తిమీర తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. థైరాయిడ్ సమస్యతో బాదపడేవారు కొత్తిమీర తింటే ఎంతో మేలు కలుగుతుంది. మెడ భాగంలో ఏర్పడే ఎండోక్రైన్ గ్రంథిని థైరాయిడ్ గా చెబుతారు. ఒక వ్యక్తి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం అంటారు.

థైరాయిడ్ గ్రంతి తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయకపోతే నీరసం, మలబద్ధకం, చలిని తట్టుకోలేకపోవడం, డిప్రెషన్, బరువు పెరగడం వంటివి దరిచేరతాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే వ్యాధిని హైపర్ థైరాయిడిజం అని చెబుతారు. వీటిని అడ్డుకునే శక్తి కొత్తిమీరకు ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వారు కొత్తిమీర తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ధనియాలు తినడం వల్ల హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండింటిని కొత్తిమీర ఎదుర్కొంటుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం చురుకుగా ఉంచుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను తీసుకోవడం శ్రేయస్కరం. కొత్తిమీరను చట్నీ, కూర రూపంలో తీసుకోవడం మంచిది. కొత్తిమీరను తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కొత్తిమీర రసం వారంలో రెండు మూడు సార్లు తాగితే థైరాయిడ్ అదుపులో ఉండటం ఖాయం. కొత్తిమీర లేదా ధనియాలను నీటిలో ఉడకబెట్టి, వడకట్టుకుని ఆ నీటిని తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల మంచి లాభాలుంటాయి.

ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్య అందరిని వేధిస్తోంది. అదుపు తప్పిన జీవన శైలి, ఆహార అలవాట్లు మనల్ని ఎన్నో రోగాలకు దగ్గర చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో థైరాయిడ్ ను ఎదుర్కోవాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. దీంతో పాటు ఇంకా పలు రోగాలకు కూడా ఇది పరోక్షంగా సాయపడుతుంది. కొత్తిమీరను వాడుకుని ఎన్నో రకాలుగా మనకు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కొత్తిమీరను కూరల్లో వేసుకుంటే మంచి వాసన, రుచి రావడం సహజమే.