Money: నిత్యం వివిధ పనుల నిమిత్తం మనం బయటకు వెళ్తుంటాం. ఇలా బయటకు వెళ్లినప్పుడు రోడ్లపై మనకు అనేక రకాల వస్తువులు, చెత్త చెదారం కనిపిస్తుంది. ఒక్కోసారి విలువైన వస్తువులు కూడా మన కంట పడతాయి. కొందరికి డబ్బులు దొరుకుతాయి. అయితే రోడ్డుపై దొరికే డబ్బులకు అర్థం ఏమిటి.. అది దేనికి సంకేతం అని మనం ఆలోచించం. డబ్బులు కనిపించగానే చుట్టూ ఎవరూ లేకపోతే టక్కున తీసుకుని జేబులో వేసుకుంటాం. మరి ఇది దేనికి సంకేతమో తెలుసుకుందాం.
అందరికీ అలా జరుగదు..
రోడ్డపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అందరికీ డబ్బులు దొరకవు. చాలా తక్కువ మందికి ఇలా డబ్బులు దొరుకుతాయి. అదీ ఎప్పుడో ఒకసారి మాత్రమే. మరి రోడ్డుపై పడిన డబ్బులు తీసుకోవచ్చా.. తీసుకుని ఖర్చు చేయవచ్చా.. అలా చేస్తే ఏమవుతుంది వంటి ఆలోచనలు వస్తాయి. అయితే ఆధ్యాత్మికంగా దీనికి గురించి పండితులు కొన్ని విషయాలు చెబుతున్నారు. రోడ్డుపై డబ్బులు కనిపించగానే కొందరు టక్కున తీసుకుని జేబులో పెట్టుకుంటారు. కొందరు చుట్టూ చూస్తారు. ఎవరివి అయినా అయి ఉంటాయా అని ఆలోచిస్తారు. ఎవరైనా తమ డబ్బులు అని వెతుక్కుంటూ వస్తే వారికి ఇచ్చేస్తారు. ఎవరూ లేకపోతే తీసుకుంటారు. ఇలా డబ్బులు కనిపించడం ఓ సంకేతం అని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.
దేనికి సంకేతం..
హిందూ సంప్రదాయం ప్రకారం డబ్బులు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఇలాంటి నేపథ్యంలో రోడ్డుపై డబ్బులు కనిపించగానే చూసీ చూడనట్టు వ్యవహరించడం లక్ష్మీదేవిని అవమానించినట్లు అనుకుంటారు. అందుకే వీధిలో డబ్బులు దొరికితే అగౌరవంగా చూడొద్దని సూచిస్తున్నారు. అందుకే వెంటనే తీసుకుని వాటిని పోగొట్టుకున్నవారికి అందించాలని చూస్తారు. అయితే డబ్బులు దొరికితే ఏం చేయాలో చూద్దాం.
ఇలా చేయాలి..
రోడ్డుపై డబ్బులు చూసినప్పుడు వేర్వేరు అర్థాలు ఉన్నాయని జోతిష్యులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు డబ్బులు కనిపించడం, ఇంటికి వస్తున్నప్పుడు డబ్బులు కనిపించడం జరిగితే దానిని కార్యాలయంలో ఉంచాలి. లేదా దేవాలయంలో ఇవ్వడం మంచిది అని సూచిస్తున్నారు. ఖర్చు చేయడం మంచిది కాదని పండితులు పేర్కొంటున్నారు.
ఇక మీరు పనిచేసేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని నుంచి వచ్చేటప్పుడు డబ్బులు దొరికితే దానిని తీసుకుని దగ్గర ఉంచుకోవాలట. అయితే ఈ డబ్బులు మనం కష్టపడి సంపాదించలేదని గుర్తుంచుకోవాలి. ఇక విదేశాల నుంచి స్వదేశాలకు వస్తున్నప్పుడు, వచ్చిన తర్వాత డబ్బులు దొరికితే వాటిని ఎన్వలప్ కవర్‌లో ఉంచుకోవాలి.
శుభ సంకేతం..
జ్యోతిష్యం ప్రకారం వీధిలో డబ్బులు చూస్తే అది చాలా మంచి సంకేతంగా పరిగణిస్తారు. ఎందుకంటే జ్యోతిష్యంలో కూడా డబ్బును లక్ష్మీదేవి రూపంగానే పరిగణిస్తారు. ధనం లభించినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని తెలుసుకోవాలి. దీంతో ఆర్థిక సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని గుర్తించాలని పండితులు సూచిస్తున్నారు.