https://oktelugu.com/

Ramya Krishnan: ఏంటి రమ్యకృష్ణ బికినీ వేశారా?… సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫోటోలు!

Ramya Krishnan: నటిగా రమ్యకృష్ణది నాలుగు దశాబ్దాల ప్రస్థానం. చాలా చిన్న వయసులోనే ఆమె ముఖానికి రంగు వేసుకున్నారు. తమిళ నటుడు ఛో రామస్వామికి రమ్యకృష్ణ బంధువు. ఆ పరిచయాలతో నటిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే బాగా పాపులర్ అయ్యారు. ఆమె పేరు రమ్యకృష్ణన్ కాగా రమ్యకృష్ణగా ప్రాచుర్యం పొందారు. ప్రతి హీరోయిన్ కి ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ తరహా పాత్రలకు సెట్ అవుతుందనే భావన కలుగుతుంది. కానీ రమ్య కృష్ణ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 19, 2023 / 04:25 PM IST
    Follow us on

    Ramya Krishnan

    Ramya Krishnan: నటిగా రమ్యకృష్ణది నాలుగు దశాబ్దాల ప్రస్థానం. చాలా చిన్న వయసులోనే ఆమె ముఖానికి రంగు వేసుకున్నారు. తమిళ నటుడు ఛో రామస్వామికి రమ్యకృష్ణ బంధువు. ఆ పరిచయాలతో నటిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే బాగా పాపులర్ అయ్యారు. ఆమె పేరు రమ్యకృష్ణన్ కాగా రమ్యకృష్ణగా ప్రాచుర్యం పొందారు. ప్రతి హీరోయిన్ కి ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ తరహా పాత్రలకు సెట్ అవుతుందనే భావన కలుగుతుంది. కానీ రమ్య కృష్ణ ఆల్ ఇన్ వన్. నవరసాలు సమానంగా పండించగల గొప్ప నటి. ఆమె సక్సెస్ సీక్రెట్ కూడా అదే.

    స్టార్స్ పక్కన కమర్షియల్ చిత్రాలు చేసిన రమ్యకృష్ణ పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. డివోషనల్ క్యారెక్టర్స్ చేశారు. చివరకు వేశ్యగా కూడా నటించారు. నరసింహ మూవీలో నీలాంబరి, బాహుబలి సిరీస్లో శివగామి పాత్రలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఇలాంటి గొప్ప పాత్రలు ఆమె అనేకం చేశారు. కాగా రమ్యకృష్ణ బోల్డ్ రోల్స్ చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద స్కిన్ షోకి కూడా వెనుకాడలేదు. పాత్రలు డిమాండ్ చేస్తే ఆమె సాహసాలు చేసేందుకు వెనుకాడలేదు.

    కొన్ని సినిమాల్లో రమ్యకృష్ణ బికినీ ధరించారు. ఈ ఆధునిక యుగంలో కూడా హీరోయిన్ బికినీ వేయడాన్ని విశేషంగా జనాలు మాట్లాడుకుంటారు. ఆ పని ఇరవై ముప్పై ఏళ్ల క్రితమే రమ్యకృష్ణ చేశారు. రమ్యకృష్ణ కొన్ని చిత్రాల్లో బికినీ ధరించడం జరిగింది. వాటిలో అల్లుడా మజాకా చిత్రం కూడా ఒకటి. చిరంజీవి హీరోగా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన అల్లుడా మజాకా మూవీలో రమ్యకృష్ణ, రంభ ఓ సీన్ కోసం బికినీ వేశారు.

    Ramya Krishnan

    నటిగా పరిపూర్ణత సాధించాలంటే అన్ని షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలని నమ్మిన రమ్యకృష్ణ ప్రయోగాలతో పాటు సాహసంతో కూడిన రోల్స్ చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. ప్రకాష్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. రంగమార్తాండ మూవీలో రమ్యకృష్ణ పాత్ర గొప్పగా ఉండనుంది. బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు.

    Tags