Silk Smitha : ఒక అబద్దాన్ని పదే పదే రుద్దితే అది నిజం అయిపోతుంది, ఇది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రాజకీయ పార్టీలు మొదటి నుండి చేస్తున్న పనులే. రీసెంట్ గా వైసీపీ పార్టీ సూపర్ స్టార్ రజినీకాంత్ మీద ఒక రేంజ్ లో విమర్శలు చేస్తుంది. మంత్రుల దగ్గర నుండి MLA ల వరకు రజినీకాంత్ పై నోటికి వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు.భారతదేశం గర్వించదగ్గే ఒక సూపర్ స్టార్ ని ఇంత నీచంగా కామెంట్స్ చెయ్యడం అనేది చాలా పెద్ద తప్పు.
వైసీపీ పార్టీ వాళ్ళు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం రజినీకాంత్ రీసెంట్ గా విజయవాడలోని పోరంకి మండలం లో జరిగిన ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు హాజరు అయ్యి చంద్రబాబు ని పొగుడుతూ మాట్లాడమే. వైసీపీ పార్టీ పై రజినీకాంత్ పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు. కేవలం తన మిత్రుడు చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే గొప్పగా మాట్లాడాడు, దీనికి వైసీపీ పార్టీ నాయకులూ మాట్లాడిన మాటలు వింటే, ఇలాంటి పార్టీ ఉన్న రాష్ట్రము లో ఉన్నందుకు సిగ్గు పడుతున్నామని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్నాళ్ల రజినీకాంత్ సినీ కెరీర్ లో ఒక్క మచ్చ కూడా లేదు, నలుగురికి సహాయం చేసే గొప్ప గుణమే తప్ప, ఎవరికీ ఆయన అన్యాయం చెయ్యలేదు. ఈ విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు, అయినా కానీ ఆయన పై బురద చల్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. రజినీకాంత్ కి మరియు సిల్క్ స్మిత కి అక్రమ సంబంధం ఉందని, రజినీకాంత్ పెట్టే చిత్రహింసలు భరించలేకనే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, వైసీపీ పార్టీ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చెయ్యడం ప్రారంభించింది.అందుకోసం సిల్క్ స్మిత గతం లో రాసిన లేఖకు రజినీకాంత్ కి లింక్ చేస్తున్నారు. అందులో ఆయన పేరు ఆమె ఎక్కడా కూడా ప్రస్తావించలేదు.
కానీ ఆమె కామెంట్ చేసింది రజినీకాంత్ గురించే అంటూ లేని పోనీ రూమర్స్ ప్రచారం చేసి జనాలకు ఇది నిజం అని అనిపించేదాకా రుద్దేస్తున్నారు. కానీ ఇదంతా చేస్తున్న వైసీపీ ఫ్యాన్స్ ని రజినీకాంత్ ఫ్యాన్స్ ఊరికే వదులుతారా..?, మాటకి మాట దెబ్బకి దెబ్బ అన్నట్టుగా వైసీపీ పార్టీ శ్రేణులను సోషల్ మీడియా లో తరిమికొడుతున్నారు. ఈ గొడవలు ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా సిల్క్ స్మిత గతం లో రాసిన లేఖలో ఏముందో మీరు కూడా చదవండి.