https://oktelugu.com/

‘Chatrapati’ Remake : పాకిస్థాన్ వ్యక్తిగా హిందీ ‘ఛత్రపతి’ హీరో.. వీవీ వినాయక్ కి పిచ్చి ముదిరింది!

హిందీ ఛత్రపతి సినిమాలో హీరో పాకిస్థాన్ కి చెందిన వ్యక్తి, అక్కడి నుండి ఇండియాలోని నార్త్ లోకి అడుగుపెట్టిన హీరో, విలన్స్ వద్ద బానిస లాగ బ్రతికి తర్వాత తిరుగుబాటు చేస్తాడు

Written By: , Updated On : May 3, 2023 / 09:37 PM IST
Follow us on

‘Chatrapati’ Remake : రీమేక్స్ చెయ్యడం లో ఎలాంటి తప్పు లేదు,కానీ కొన్ని కొన్ని సినిమాలను ఎట్టిపరిస్థితిలో ముట్టుకోకూడదు అని అంటుంటారు విశ్లేషకులు. తెలుగు లో మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్,రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరో గా పెట్టి హిందీ లో తీసాడు.

ఈ సినిమా ఈనెల 12 వ తారీఖున హిందీ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఈమధ్యనే విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ఆడియన్స్ కి రకరకాలుగా అనిపించింది. తెలుగు లో శ్రీలంక నుండి వైజాగ్ కి వలస వచ్చినట్టుగా హీరో పాత్రని చూపించాడు రాజమౌళి.ఇక్కడకి వచ్చిన తర్వాత లోకల్ లీడర్స్ పెట్టే చిత్రహింసలు ఎదురుకొని విసుగెత్తిపోయిన హీరో, వాళ్ళ మీద తిరుగుబాటు చెయ్యడం, ఆ తర్వాత లీడర్ గా ఎదగడం, ఇలా ఛత్రపతి సినిమా మొత్తం ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాది.

అయితే హిందీ ఛత్రపతి సినిమాలో హీరో పాకిస్థాన్ కి చెందిన వ్యక్తి, అక్కడి నుండి ఇండియాలోని నార్త్ లోకి అడుగుపెట్టిన హీరో, విలన్స్ వద్ద బానిస లాగ బ్రతికి తర్వాత తిరుగుబాటు చేస్తాడు.ఇండియా -పాకిస్థాన్ బోర్డర్ దగ్గర జరిగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వినాయక్.ఒక పాకిస్థాన్ యువకుడు,ఇండియా కి చెందిన వారిపై తిరగబడితే ప్రేక్షకులు స్వాగతిస్తారా అనే విషయాన్నీ గుర్తించలేదు పోయాడు వినాయక్.

అసలే ఇప్పుడు మాత మరియు ప్రాంత రాజకీయాలు నార్త్ ఇండియా లో రాజ్యం ఏలుతున్నాయి. అలాంటి సమయం లో ఇలాంటి కాన్సెప్ట్ పెడితే వాళ్ళు ఊరుకుంటారా?, లేదా కావాలని కాంట్రవర్సీ సృష్టించి సినిమాకి పబ్లిసిటీ పెంచడానికి వినాయక్ ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడా? అనేది అర్థం కానీ ప్రశ్న.ఈ చిత్రాన్ని అక్కడి ఆడియన్స్ ఎలా తీసుకోబోతున్నారో తెలియాంటే 12 వ తేదీ వరకు ఆగాల్సిందే.