Nagarjuna – Tabu : అమల పక్కన ఉండగానే నాగార్జున ‘టబు’ తో రొమాన్స్ చేశాడా..? వైరల్ అవుతున్న ఫొటోలు

Nagarjuna – Tabu : టాలీవుడ్ లో మన్మధుడు అనే ట్యాగ్ కి పెట్టింది పేరు లాగా ఉండే హీరో అక్కినేని నాగార్జున. నిన్నటి తరం స్టార్ హీరోలలో ఈయనకి లేడీస్, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.ఆరు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటికి నవ మన్మధుడి లాగా కనిపించే నాగార్జున వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఈయన మీద ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి కానీ వాటిని […]

Written By: admin, Updated On : February 16, 2023 10:09 pm
Follow us on

Nagarjuna – Tabu : టాలీవుడ్ లో మన్మధుడు అనే ట్యాగ్ కి పెట్టింది పేరు లాగా ఉండే హీరో అక్కినేని నాగార్జున. నిన్నటి తరం స్టార్ హీరోలలో ఈయనకి లేడీస్, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.ఆరు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటికి నవ మన్మధుడి లాగా కనిపించే నాగార్జున వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఈయన మీద ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తాడు నాగార్జున.

పెద్దగా వివాదాల్లోకి కూడా ఆయన దూరడు. అయితే నాగార్జున పై ఇప్పటికే పలువురి హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడనే ప్రచారం టాలీవుడ్ లో ఉంది. అందులో టబు గురించి ప్రత్యేకించి చెప్పాలి.ఆరోజుల్లో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన వార్తలు టాలీవుడ్ లో సంచలనం గా మారాయి. అయితే వీటిపై అటు నాగార్జున కానీ, ఇటు టబు కానీ క్లారిటీ ఇవ్వకపోవడం తో ఆ రూమర్స్ ఇప్పటికీ ప్రచారంగానే ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా నిన్న నాగార్జున కి సంబంధించిన కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. వాటిని చూసి అభిమానుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎందుకంటే ఈ ఫోటోలలో టబు మరియు అమల మధ్య అక్కినేని నాగార్జున ఉండడమే.అక్కినేని అమల నాగార్జున కి కుడి వైపు ఉండగా , టబు ఎడమ వైపు వెనుక నుండి నాగార్జున ని రొమాంటిక్ గా హగ్ చేసుకుంటుంది.

దానిని చూసి అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఒకప్పుడు నిజంగానే టబు మరియు నాగార్జున మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కోడైకూస్తున్నారు.  గత కొద్దీ రోజుల నుండి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.