https://oktelugu.com/

Kiara Advani : పిల్లల్ని కనడం ఇష్టం లేక అబార్షన్ చేయించుకున్న కియారా? బాలీవుడ్ ని ఊపేస్తున్న న్యూస్!

Kiara Advani : హీరోయిన్ కియారా అద్వానీ అబార్షన్ చేయించుకున్నారన్న న్యూస్ బాలీవుడ్ ని ఊపేస్తోంది. ఈ మేరకు ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిలిం క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్ కి బాలీవుడ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 16, 2023 / 08:53 AM IST
    Follow us on

    Kiara Advani : హీరోయిన్ కియారా అద్వానీ అబార్షన్ చేయించుకున్నారన్న న్యూస్ బాలీవుడ్ ని ఊపేస్తోంది. ఈ మేరకు ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిలిం క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్ కి బాలీవుడ్ మొత్తం కొలువుదీరారు.

    దాదాపు మూడేళ్ళుగా రిలేషన్ లో ఉన్న కియారా-సిద్ధార్థ్ హడావుడిగా పెళ్లి చేసుకోవడానికి ఆమె గర్భం దాల్చడమే కారణం అంటూ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఆర్ ఖాన్ అప్పట్లో ట్వీట్ చేశాడు. పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ కావడం నయా ట్రెండ్. మొన్న అలియా భట్, నేడు కియారా అద్వానీ గర్భం దాల్చాక వివాహం చేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశాడు. కమల్ ఆర్ ఖాన్ ట్వీట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

    తాజాగా కియారాపై ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు దారుణ ఆరోపణలు చేశాడు. అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేని కియారా అద్వానీ అబార్షన్ చేయించుకుంది. ఆమెకు కెరీరే ముఖ్యం. స్వార్థపరురాలు అంటూ… తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశాడు. ఉమర్ సంధు ట్వీట్ వైరల్ గా మారింది. ఇటీవల ఉమర్ సంధు తారలను ఉద్దేశిస్తూ వరుసగా వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్స్ కి ఎఫైర్స్ అంటగడుతూ ట్వీట్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఉమర్ సంధు హైప్ కోసం ఇదంతా చేస్తున్నాడని పలువురు భావిస్తున్నారు.

    కాగా కియారా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించారు. రెండోసారి రామ్ చరణ్ తో జతకట్టారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. ఈ మూవీ మీద పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.