https://oktelugu.com/

జాతిరత్నం నవీన్ పోలిశెట్టి పారితోషికం అంత పెరిగిందా?

సినీరంగానికి చెందిన వార‌సుడు అయితే.. ఏమీ చేయాల్సిన అవ‌స‌రం లేదు. అవ‌కాశమే వెతుక్కుంటూ వ‌స్తుంది. అదే బ‌య‌టి వ్య‌క్తి ఇండ‌స్ట్రీలోకి రావాలంటే.. ఎన్ని దిగిరావాలో తెలుసా? ఎన్ని ఎక్కాలో తెలుసా..? ఈ గ్యాప్ లో మ‌రెన్ని కోల్పోవాలో తెలుసా..? అది అనుభ‌వించిన వారికీ.. కోల్పోయిన వారికి మాత్ర‌మే తెలుసు. అయితే.. ఇన్ని చేసినా అవ‌కాశం రానివారు, స‌క్సెస్ అందుకోలేని వారు ఎంద‌రో..?! ఇదేవిధంగా ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు న‌వీన్ పొలిశెట్టి. చిన్ననాటి నుంచే నటనపై ప్రేమ పెంచుకున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2021 / 06:20 PM IST
    Follow us on

    సినీరంగానికి చెందిన వార‌సుడు అయితే.. ఏమీ చేయాల్సిన అవ‌స‌రం లేదు. అవ‌కాశమే వెతుక్కుంటూ వ‌స్తుంది. అదే బ‌య‌టి వ్య‌క్తి ఇండ‌స్ట్రీలోకి రావాలంటే.. ఎన్ని దిగిరావాలో తెలుసా? ఎన్ని ఎక్కాలో తెలుసా..? ఈ గ్యాప్ లో మ‌రెన్ని కోల్పోవాలో తెలుసా..? అది అనుభ‌వించిన వారికీ.. కోల్పోయిన వారికి మాత్ర‌మే తెలుసు. అయితే.. ఇన్ని చేసినా అవ‌కాశం రానివారు, స‌క్సెస్ అందుకోలేని వారు ఎంద‌రో..?! ఇదేవిధంగా ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు న‌వీన్ పొలిశెట్టి. చిన్ననాటి నుంచే నటనపై ప్రేమ పెంచుకున్న నవీన్ పోలిశెట్టి.. ఎలాగైనా ఇండ‌స్ట్రీకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ.. అంద‌రి త‌ల్లిదండ్రుల్లాగానే వీళ్ల పేరెంట్స్ కూడా అబ్జ‌క్ష‌న్ అన్నారు.

    శేఖ‌ర్ క‌మ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో ఛాన్స్‌. ఆ సినిమా చూసిన ద‌ర్శ‌కుడు స్వ‌రూప్‌.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి అప్రోచ్ అయ్యాడు. కాన్సెప్ట్ వెరైటీ ఉంద‌ని క‌నెక్ట్ అయ్యాడు. ఆడియ‌న్స్ మ‌నోడికి క‌నెక్ట్ అయ్యారు.

    ఆ త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే మ‌న ‘జాతిర‌త్నాలు’ త‌యార‌య్యాయి. ఇప్పుడు ఈ మూవీ థియేట‌ర్ల‌లో దున్నేస్తోంది. అలా.. తెలుగు తెర‌పై ఓ ర‌త్న‌మై వెలగ‌డానికి సినిమా క‌ష్టాల‌ను మించి అనుభ‌వించాడు న‌వీన్ పొలిశెట్టి.

    తాజాగా జాతిరత్నాలు మూవీ నవీన్ కెరీర్ నే మార్చివేసింది. తాజాగా అతడికి అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి. హారిక హాసిని సంస్థ న‌వీన్ కి అడ్వాన్సు ఇచ్చిన‌ట్టు టాక్‌.

    ద‌ర్శ‌కుడెవ‌రో తేల‌క‌పోయినా ఈ సినిమా కోసం న‌వీన్‌కు 5 కోట్ల పారితోషికం ఇచ్చిన‌ట్టు టాక్‌. ఒక చిన్న సినిమాతో మొదలైన నవీన్ పోలిశెట్టి ప్రస్థానం ఒక్క హిట్ తో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.. అదే అదృష్టమంటే..