
Nani: సోషల్ మీడియా మొత్తం గత కొంతకాలం గా నెపోటిజం గురించి తెగ మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే.సెలెబ్రిటీలు సైతం ఈ నెపోటిజం గురించి తప్పక స్పందించే రేంజ్ లో ఈ క్యాంపైన్ సోషల్ మీడియా లో నడిచింది.ఇండస్ట్రీ లో వారసత్వం ఉండడం వల్లే కొత్తవాళ్లకు అవకాశాలు రావడం లేదని,స్టార్ కిడ్స్ గా అడుగుపెట్టి ఇండస్ట్రీ చాలా తేలికగా సక్సెస్ అయిపోతున్నారని,ఈ నెపోటిజం ఆపి తీరాల్సిందే అంటూ గత కొంతకాలం గా ఒక ఉద్యమం లాగా సోషల్ మీడియా లో క్యాంపైన్ నడిపిస్తున్నారు ఒక వర్గానికి చెందిన నెటిజెన్స్.
దీనిపై ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ సాధించి నేడు న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని స్పందించాడు.’సోని లైవ్’ యాప్ లో ప్రముఖ పాప్ సింగర్ స్మిత ఆధ్వర్యం లో ‘నిజం విత్ స్మిత’ అనే కార్యక్రమం ఈమధ్యనే మొదలైంది.మెగాస్టార్ చిరంజీవి మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా హాజరవ్వగా, రెండవ ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు.

ఇక మూడవ ఎపిసోడ్ కి న్యాచురల్ స్టార్ నాని మరియు దగ్గుపాటి రానా హాజరయ్యారు.ఈ ఎపిసోడ్ లో స్మిత నెపోటిజం గురించి అడిగిన ప్రశ్నకి నాని సమాధానం చెప్తూ ‘బ్యాక్ గ్రౌండ్ అనేది కేవలం ఒక్క సినిమాకి మాత్రమే ఉపయోగపడుతుంది, ఆ తర్వాత టాలెంట్ ఉంటేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయి, ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళని ఎంతో మందిని చూసాము, అలాగే ఫుల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవాళ్లు కూడా సక్సెస్ కాలేక నేడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.అయినా నెపోటిజం ని ప్రోత్సహిస్తుంది ఎవరో కాదు, మన ఆడియన్స్ మాత్రమే.ఉదాహరణకి నేను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చాను, నా సినిమాని కేవలం లక్షల సంఖ్యలోనే ఆడియన్స్ చూస్తారు.అదే రామ్ చరణ్ సినిమా విడుదలైతే కోట్లమంది చూస్తారు, ఇక్కడ మనకి అర్థం అయ్యింది ఏంటి?, ఆడియన్స్ నెపోటిజం ని ప్రోత్సహిస్తున్నట్టా.రామ్ చరణ్ లో టాలెంట్ ఉంది కాబట్టి చూస్తున్నారు, టాలెంట్ లెకపొయ్యుంటే హ్యాపీ గా ఇంట్లో కూర్చొని ఎదో ఒక బిజినెస్ ని చేసుకునేవాళ్ళు’ అంటూ నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.