
Samantha- Pritam: సమంత విడాకుల విషయంలో ఒక పేరు ప్రముఖంగా వినిపించింది. అదే ప్రీతమ్ జూకాల్కర్. సమంత పర్సనల్ స్టైలిష్ట్, డిజైనర్ అయిన ప్రీతమ్ తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన నాగ చైతన్య ఆగ్రహానికి గురయ్యాడు. అతని కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు, ఆపై విడాకులు అయ్యాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రీతమ్-సమంత ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేశాయి. ప్రీతమ్ అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఫ్యాన్స్ అతనిపై సోషల్ మీడియా వేధింపులకు పాల్పడ్డారు.
అక్కినేని ఫ్యాన్స్ దెబ్బకు ప్రీతమ్ వివరణ ఇచ్చుకున్నాడు. మీరు అనుకున్నట్లు నేను ఎలాంటి తప్పు చేయలేదు. సమంత నాకు అక్కతో సమానం. ఆమెతో నాకున్న అనుబంధం ఎలాంటిదో చైతూకు కూడా తెలుసు. అనవసరంగా నన్ను వేధించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రీతమ్ తో ఎఫైర్ అంటూ ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా సమంత అతన్ని వదల్లేదు. ఒక ప్రక్క పుకార్లు చక్కర్లు కొడుతుంటే అతనితో విహారానికి వెళ్లారు. ప్రీతమ్, మేకప్ అసిస్టెంట్ సాధనతో కలిసి సమంత దుబాయ్ ట్రిప్ కి వెళ్లడం జరిగింది.
తమ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. నేను ఎవరి విమర్శలు పట్టించుకోనని… పరోక్షంగా సమంత తెలియజేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె ప్రీతమ్ ని వదల్లేదు. అతనితో ఆమె బంధం కొనసాగింది. ప్రీతమ్ డిజైన్ చేసిన బట్టల్లో పలు ఫోటో షూట్స్ చేశారు. అయితే కొన్నాళ్లుగా సమంత-ప్రీతమ్ కలిసిన దాఖలు లేవు. తరచుగా సోషల్ మీడియాలో కలిసి కనిపించే వీరిద్దరూ ఒక్కసారిగా దూరమయ్యారు. సమంత అతన్ని కలవడం లేదు. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనేది టాలీవుడ్ టాక్.

మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. అదే సమయంలో సమంత షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. అందుకే ప్రీతమ్ ని కలవడం లేదు. అంతకు మించి వేరే కారణం లేదు. వారి ఫ్రెండ్షిప్ హెల్తీగా కొనసాగుతుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సమంత సిటాడెల్ సిరీస్ షూట్ లో పాల్గొంటున్నారు. లేటెస్ట్ షెడ్యూల్ నైనిటాల్ లో జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలో ఖుషి చిత్ర షూట్ తిరిగి ప్రారంభించనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు.