
Wikipedia- Adani: వికీ పీడియా లో దిద్దుబాటు: అదానీ పై హిండెన్ బర్గ్ మరో బాంబుఅదానీ ని హిండెన్ బర్గ్ చీఫ్ అండర్సన్ ఇప్పట్లో వదిలేలా లేడు. మొన్నటి దాకా ఆయన కంపెనీలలో పెట్టుబడుల గురించి, తీసుకొస్తున్న అప్పుల గురించి కీలక పత్రాలు బయటపెట్టి సంచలన విషయాలు ప్రపంచం ముందుంచాడు. ఇప్పుడు తాజాగా వికీపీడియా రూపంలో మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.. ఇప్పుడు తాజాగా జేమ్స్ అండర్సన్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే.. గౌతమ్ అదాని తనకు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాసాలు ఉన్న పేజీలను పద్ధతి ప్రకారం ముసుగు ఖాతాలతో దిద్దించారని పేర్కొన్నారు. ఈ మేరకు వికీపీడియా స్వతంత్ర పత్రిక సైన్ పోస్ట్ ప్రచురించిన వ్యాసంలో కొంత భాగం స్క్రీన్ షాట్ ను అండర్సన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఎవరైనా దిద్దొచ్చు
వికీపీడియా వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు.. అయితే, తర్వాత వాటిని సరి చూసి తప్పులను పరిహరించే యంత్రాంగం ఒకటి ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని 40 కి పైగా సాక్ పప్పెట్స్( అంటే ముసుగు ఖాతాలు. ఉదాహరణకు మనమే రెండు ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి…ఒక ఖాతాలో పోస్ట్ పెట్టి, రెండో ఖాతాతో లాగిన్ అయ్యి మొదటి ఖాతాలో పెట్టిన మన పోస్ట్ మనమే పొగుడుతూ కామెంట్లు పెడితే ఆ రెండో ఖాతాను సాక్ పప్పెట్ అంటారు. డబ్బులు తీసుకొని వేరొకరి కోసం ఇలాంటి ఖాతాలలో పనిచేస్తే వాటిని కూడా సాక్ పప్పెట్ అకౌంట్స్ గా వ్యవహరిస్తారు.. వీటి సహాయంతో అదానీ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 9 వ్యాసాలను దిగినట్టు సైన్ పోస్ట్ పత్రిక పేర్కొన్నది..

అదానీ పై పొగడ్తలు
ఆ వ్యాసాలు దిద్దిన వారు ఆదానిపై పొగడ్తలు గుప్పించినట్టు వెల్లడించింది. వీటిని దిద్దిన వారిలో ఒక పెయిడ్ ఎడిటర్ కూడా ఉన్నాడని, ఆ ఎడిటర్ అదాని కంపెనీ ఐపీ చిరునామాతో, అదాని గ్రూప్ ఆర్టికల్ మొత్తాన్ని తిరగరాశాడని వివరించింది..కాగా, వికీపీడియాలో ఖాతా పేర్ల నిబంధన ప్రకారం ఆ సంస్థ 2013 మే లో ఆదాని గ్రూప్ ఆన్లైన్ అనే యూజర్ ను, 2014 సెప్టెంబర్లో అదాని గ్రూప్ అనే యూజర్ ను వ్యాసాలు రాయకుండా, దిద్దకుందా నిషేధించింది. ఇలా చేసి ప్రధాని తన పూర్తి వివరాలను బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని జేమ్స్ అండర్సన్ ఆరోపిస్తున్నాడు.. అంతేకాదు అతని తన కంపెనీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను కూడా పలుమార్లు దిద్దుబాటుకు గురి చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రస్తుతం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఆదాని గ్రూప్ ఇంతవరకూ స్పందించలేదు..