
Rajinikanth- Dhanush: కోలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా ధనుష్ కి మంచి క్రేజ్ ఉంది.నటుడిగా ఆయన నేటి తరం స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా చేరుకొని ఎత్తైన పర్వతాలను ఎక్కి కూర్చున్నాడు.ఆయన హీరో గా నటించిన ‘అసురన్’ చిత్రం లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆయనకీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని కూడా అందుకున్నాడు.అలా నేటి తరం హీరోలలో నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక హీరో గా ధనుష్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
అంతే కాదు ఈయన హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించే అవకాశం దక్కాయి,ఇప్పుడు రీసెంట్ గా తెలుగు లో ‘సార్’ అనే చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తెలుగు లో కూడా తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.అలా నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలు మరియు ఎన్నో విజయాలు అందుకున్న ధనుష్ ఈమధ్యనే చెన్నై లోని ‘పోయిస్ గార్డెన్’ లో 150 కోట్ల రూపాయిలను ఖర్చు చేసి నిర్మించుకున్నాడు.
ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియా లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.ఎందుకంటే పోయిస్ గార్డెన్స్ అనే ప్రాంతం లో అత్యంత సంపన్నులు మాత్రమే ఉండే ప్రాంతం ఇది.ఇక్కడే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు కూడా ఉంది.గతం లో ఆయన ఇంట్లో ధనుష్ తల్లి తండ్రులకు అవమానం జరిగిందట.ఎక్కడైతే ఆయన తల్లితండ్రులకు అవమానం జరిగిందో, అక్కడే 150 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించి అమ్మానాన్నలకు గిఫ్ట్ గా ఇచ్చాడని ఒక రూమర్ కోలీవుడ్ ని ఊపేసింది.

అయితే వీటిపై ధనుష్ సన్నిహిత వర్గాలు స్పందించాయి.వాస్తవానికి ఈ ఇంటిని ధనుష్ తన భార్య ఐశ్వర్య తో కలిసి నివసించేందుకు కట్టుకున్నాడు.అయితే ఇప్పుడు ఆమె ధనుష్ తో విడిపోవడంతో ఇప్పుడు ఈ ఇంటిని తన తల్లి పేరు మీదకు మార్చి ఆమెకి బహుమతిగా ఇచ్చాడట.అంతకు మించి మరొకటి లేదని, దయచేసి మీకు ఇష్టమొచ్చిన కథలు అల్లొద్దు అంటూ ధనుష్ సన్నిహిత వర్గాలు తెలియచేస్తున్నాయి.