Homeక్రీడలుIndia Vs Australia 4th Test: డ్రా కోసం 22 రోజుల పిచ్ ను బీసీసీఐ...

India Vs Australia 4th Test: డ్రా కోసం 22 రోజుల పిచ్ ను బీసీసీఐ వాడిందా.. అసలు నిజం ఇది..!

India Vs Australia 4th Test
India Vs Australia 4th Test

India Vs Australia 4th Test: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న ఈ వికెట్లపై ఇరు జట్లు భారీ స్కోర్ నమోదు చేయడంతో ఫలితం తేలకుండానే ఈ టెస్ట్ మ్యాచ్ ముగియనున్నది. అయితే ఈ సిరీస్ లోని గత మూడు మ్యాచ్లు రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. టర్నింగ్ ట్రాక్స్ పై బ్యాటర్లు ఆడలేకపోయారు. తొలి రెండు టెస్టులకు సంబంధించిన పిచ్ కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. కానీ, ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ కు మాత్రం పూర్ రేటింగ్ ఇవ్వడంతో పాటు మూడు డీ మెరిట్ పాయింట్స్ కేటాయించింది. దీంతో బీసీసీఐ అహ్మదాబాద్ వికెట్ ను బ్యాటింగ్ అనుకూలంగా తయారు చేసింది.

22 రోజుల పిచ్..
నాలుగో టెస్ట్ జరుగుతున్న అహ్మదాబాద్ పిచ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిరీస్ గెలవాలనే ఉద్దేశంతోనే బీసీసీ ప్లాట్ వికెట్ తో చీటింగ్ కు తెర లేపింది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా ఆరోపించాడు. ఈ మ్యాచ్కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆయన అహ్మదాబాద్ టెస్ట్ వికెట్ ఐదు రోజుల పిచ్ కాదని, 22 రోజుల పిచ్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘గత మూడు టెస్టులకు ఉపయోగించిన పిచ్ లు కేవలం రెండున్నర రోజుల పిచ్ లు మాత్రమే, కానీ అహ్మదాబాద్ వికెట్ మాత్రం ఐదు రోజుల పిచ్ కాదు, 22 రోజుల పిచ్. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు’ అంటూ మార్క్ వా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. సిరీస్ గెలవాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ పెట్టిన సిద్ధం చేశారని, చివరి టెస్టులో ఫలితం వస్తుందని మేమంతా ఆశించామన్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆశిష్ ఆడిందని అయితే ఇలాంటి ఫలితాలు రావడం అసాధ్యమని, తొలి మూడు టెస్టుల్లో ఏడు రోజుల్లోనే 91 వికెట్లు పడితే చివరి టెస్టుల్లో నాలుగు రోజుల్లో 15 వికెట్లు మాత్రమే పడ్డాయని మార్క్ వా
తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ధీటుగా బదులిచ్చిన దినేష్ కార్తీక్.. రవి శాస్త్రి..

మార్కు వా వ్యాఖ్యలపై సహచర కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న దినేష్ కార్తీక్, రవి శాస్త్రి తమదైన శైలిలో స్పందించారు. ఆసీస్ మీడియా, మాజీ క్రికెటర్లు కోరుకున్నది ఈ తరహా పిచ్ కదా..? అని ప్రశ్నించారు. ‘స్పిన్ వికెట్లు అంటూ భారత పిచ్ లపై గగ్గోలు పెట్టిన వారంతా ఇప్పుడు సంతోషంగా ఉంటారు అనుకుంటా. వారు ఎలాంటి పిచ్ ను ఆశించారో అలాంటిదే దొరికింది. స్పిన్ ను ఆడేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫలితం వచ్చినా, రాకపోయినా పోయేదేం లేదు. ఫ్లాట్ వికెట్ పైన కూడా ఏడుస్తున్నారు. అసలు మీకు ఎలాంటి పిచ్ కావాలి..? ఇలాంటి బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్..? లేక మూడు రోజుల్లో ముగిసిపోయే స్పిన్ పిచ్ ఆ..? అని రవి శాస్త్రి ప్రశ్నించాడు.

India Vs Australia 4th Test
India Vs Australia 4th Test

బ్యాటింగ్ స్లోగా..

ఇక మరో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ భారత జట్టు ఉద్దేశపూర్వకంగానే స్లోగా బ్యాటింగ్ చేసిందని విమర్శించాడు. మ్యాచ్ ను డ్రా చేయాలనే ఉద్దేశంతోనే టీమ్ ఇండియా స్లోగా ఆడింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. కావాలనే రెండు రోజులపాటు బ్యాటింగ్ చేసిందని, వాళ్లు వేగంగా ఆడాలనుకుంటే ఇంకా చాలా ముందే ఇండియా ఇన్నింగ్స్ ముగిసేదని విమర్శించాడు. కానీ డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతోనే భారత బ్యాటర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారని, ఓవర్లు, సమయాన్ని వృథా చేశారని విమర్శించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్కు వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్ సహకరించకూడదని ప్లాన్ చేశారు అంటూ బ్రాడ్ హాడిన్ ఆరోపించారు.

Exit mobile version