
Jabardasth Comedian Komaram: ఈటీవీ లో గత పది సంవత్సరాల నుండి విరామం లేకుండా ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయమైనా సంగతి మన అందరికీ తెలిసిందే. చేతిలో పది రూపాయిలు కూడా లేని రోజుల నుండి, నేడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయారు ఈ కంటెస్టెంట్స్ అందరూ. అలా రీసెంట్ గా కొమురం అనే కమెడియన్ ప్రేక్షకుల దృష్టిలో బాగా పడ్డాడు.

మంచి కమెడియన్ గా గుర్తింపు సంపాదించిన ఈయనకి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈయన దగ్గర అక్కినేని నాగార్జున అప్పు చేసాడట. ఈ విషయం రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో ఇంత చిన్న కమెడియన్ దగ్గర అప్పు చెయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే తెలుసుకోబోతున్నాము.
ఆయన మాట్లాడుతూ ‘సినిమాల్లో చిన్న పాత్రల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్నా రోజులవి. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కినేని నాగార్జున గారు నేను ఉన్న ప్రదేశానికి చిరాకుగా వచ్చాడు. ఆయన అసిస్టెంట్ ని సిగరెట్ కోసం గట్టిగా అడుగుతున్నాడు, ఆ సమయం లో అతను అక్కడ లెకపొయ్యేసరికి నేనే బయటకెళ్ళి సిగరెట్ తీసుకొచ్చాను. అప్పుడు నాగార్జున గారికి చిన్న అవకాశం ఉంటే ఇప్పించండి అంటూ బ్రతిమిలాడుకున్నాను. ఆయన సరేనమ్మా చూద్దాం ఏదైనా ఉంటే, ఇక్కడే ఉండు అని చెప్పి లోపలకు వెళ్ళాడు.అలా లోపలకు వెళ్లి చాలా సేపు అయినా బయటకి రాకపోవడం తో నేనే లోపలకు వెళ్ళాను, అప్పుడే మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ మార్కెట్ లోకి వచ్చింది.అది కొనుక్కొని లోపలకు తీసుకెళ్లి ఆయనకీ ఇచ్చి వచ్చాను.షూటింగ్ స్పాట్ లోపలకు వెళ్లిన నాగార్జున గారు రాత్రి పది గంటలు దాటినా బయటకి రాలేదు. అక్కడే ఉన్న నాగార్జున అసిస్టెంట్ ని పిలిచి నాగార్జున గారు ఇక బయటకి రారా అని అడిగాను.నాగార్జున అసలు ఈరోజు షూటింగ్ కి రాలేదు,లోపల ఉన్నది డూప్ అని చెప్పారు. ఒక్కసారిగా నేను షాక్ కి గురయ్యాను, నాగార్జున గారు అనుకోని అతనికి సిగరెట్ కొనిచ్చాను, కూల్ డ్రింక్ తీసిచ్చాను,ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు.ఇందుకు బాధ్యత నాగార్జున గారే కాబట్టి ఆయనే నాకు ఆ డబ్బులు ఇవ్వాలి’ అంటూ కొమురం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.