London: పేషెంట్ తో నర్సు శృంగారం… ఆ పని చేస్తుండగా రోగి మృతి..

యునైటెడ్ కింగ్ డమ్ దేశంలోని వేల్స్ లో 42 ఏళ్ల నర్సు పెనెలోప్ విలియమ్స్ ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. అదే హాస్పిటల్ లో డయాలసిస్ పేషెంట్ తో లైంగిక సంబంధం పెట్టుకుంది. దీంతో సమయం చిక్కినప్పుడల్లా అతడితో సంభోగంలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో రోగితో లైంగిక సంబందం పెట్టుకోవడాన్ని అందరు హెచ్చరించినా పట్టించుకోలేదు.

Written By: Srinivas, Updated On : July 14, 2023 3:46 pm

London

Follow us on

London: ఆమె నర్సు. పేషెంట్లకు ప్రాణం పోయాలి. సరైన చికిత్స ఇస్తే రోగి బతుకుతాడు. కానీ ఆమె వృత్తికే కళంకం తీసుకొచ్చింది. కంచే చేను మేసిన చందంగా కాపాడాల్సిన ఆమె కాటు వేసింది. రోగులను కాపాడాల్సిన నర్సే రోగితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో విషయం కాస్త అందరికి తెలిసి ఆమె ఉద్యోగం పోవడానికి కారణమైంది. రోగిని రక్షించాల్సిన నర్సు ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు.

యునైటెడ్ కింగ్ డమ్ దేశంలోని వేల్స్ లో 42 ఏళ్ల నర్సు పెనెలోప్ విలియమ్స్ ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. అదే హాస్పిటల్ లో డయాలసిస్ పేషెంట్ తో లైంగిక సంబంధం పెట్టుకుంది. దీంతో సమయం చిక్కినప్పుడల్లా అతడితో సంభోగంలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో రోగితో లైంగిక సంబందం పెట్టుకోవడాన్ని అందరు హెచ్చరించినా పట్టించుకోలేదు.

తాజాగా పేషెంట్ తో కారులోనే లైంగిక చర్యలో పాల్గొనగా అతడికి హార్ట్ ఫెయిల్యూర్ క్రానిక్ కిడ్నీ జబ్బు కారణంగా మరణించినట్లు ది టైమ్స్ యూకే రిపోర్టు చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. నర్సు వృత్తికే కళంకం తెచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. అతడికి ప్రాణాపాయం ఉంటే కనీసం అంబులెన్స్ కు కూడా కాల్ చేయలేదని చెబుతున్నారు.

నర్సుగా పనిచేసే ఆమె ఒక రోగితో ఎఫైర్ పెట్టుకోవడం గమనార్హం. రోగుల ఆలన పాలన చూడాల్సిన నర్సు అతడితోనే సంబంధం పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. వృత్తిలో బాధ్యతగా ఉండాల్సిన నర్సు దాన్ని మరిచి ఇలా బరితెగించడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పేషెంటుతోనే లైంగిక సంబంధం కొనసాగించడంపై అందరు ఆశ్చర్యపోతున్నారు.