Betel Leaf Benefits : మనకు తమలపాకు గురించి తెలుసు. మన ఇంట్లో ఏ పూజ చేయాలన్నా తమలపాకును ఉపయోగించాల్సిందే. తమలపాకును పూజకే కాకుండా కిల్లీ వేసుకోవడానికి వాడతారు. తమలపాకును చాలా రోగాలకు మందుగా కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఆంగ్ల వైద్యంతో అందరు బిళ్ల గొట్టాలు మింగుతున్నారు కానీ పూర్వం రోజుల్లో అందరు వీటిని వాడుకుని తమ రోగాలు నయం చేసుకునే వారు. ఈ నేపథ్యంలో తమలపాకుతో మనకు అనేక లాభాలు ఉన్నాయి. తమలపాకును ఇప్పటికి కూడా కొందరు కిల్లీగా వేసుకుంటారు.
తమలపాకులో ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో చాలా పోషకాలు కనిపిస్తాయి. ఊబకాయం తగ్గాలంటే తమలపాకును 10 మిరియాలు కలిపి తినాలి. ఇలా రెండు నెలల పాటు ప్రతి రోజు మిరియాలతో కలిపి తమలపాకును తీసుకుంటే ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రెండు నెలల్లో సన్నగా మారుతారు. చర్మవ్యాధులు తగ్గుతాయి. దగ్గు, జలుబు తగ్గుతుంది. తమలపాకుతో మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్య పరిరక్షణలో తమలపాకు ఎంతో బాగా పనిచేస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును దూరం చేస్తాయి. మధుమేహ పేషెంట్లకు తమలపాకు పొడి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మగవారికి శోభనం రోజు తమలపాకులు చిలకలుగా చుట్టి ఇస్తారు. తమలపాకు తీసుకో వడం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల శోభనం రోజు పెళ్లి కొడుకు రెచ్చిపోవడం ఖాయమే. తమలపాకులు ఇళ్లల్లో పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంటికి శుభం కలుగుతుంది. వాస్తు ప్రకారం కూడా తమలపాకులు ఎంతగానో దోహదపడతాయి.

తమలపాకు ఆంజనేయుడికి చాలా ఇష్టం. అందుకే మంగళ, శనివారాల్లో హనుమాన్ కు తమలపాకుల మాల వేసి పూజలు చేస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. దీంతో తమలపాకు వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమలపాకులు వినియోగించి అనేక సమస్యలకు పరిష్కారం కనుక్కోవచ్చు. దీన్ని వినియోగించి మనకు కలిగే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనికి గాను దీని మొక్కను ఇంటి ఆవరణలో నాటుకుంటే మంచి ఫలితాలు రావడం సహజమే.