Homeజాతీయ వార్తలుMLC Kavitha Dharna On Delhi: ఏమిటో చోద్యం... తెలంగాణలో ధర్నా చౌక్‌ ఎత్తేశారు.....

MLC Kavitha Dharna On Delhi: ఏమిటో చోద్యం… తెలంగాణలో ధర్నా చౌక్‌ ఎత్తేశారు.. ఢిల్లీలో ధర్నాకు స్థలం అడుగుతున్నారు!

MLC Kavitha Dharna On Delhi
MLC Kavitha Dharna On Delhi

MLC Kavitha Dharna On Delhi: తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ.. నాటి సాయుధ పారాటం. రజాకార్లపై తిరుగుబాటు.. అంతకుముందు శాతవాహనులు, కాకతీయులు, సమక్క, సారలమ్మ.. తెలంగాణ చరిత్ర అంతా పోరాటాల నేపథ్యమే. 1960లో మొదటి విడత తెలంగాణ ఉద్యమం, 2001 నుంచి జరిగిన మళి విడత పోరాటం కూడా తెలంగాణ సొంతం. పోరాటాల ద్వారానే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చుకున్నాం. కానీ, తెలంగాణ సాధించుకున్నాక ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పి కేసీఆర్‌ తర్వాత తానే సీఎం కుర్చీపై కూర్చున్నారు. తర్వాత తెలంగాణతో ఇక ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదని ధర్నా చౌక్‌ ఎత్తివేశారు. దీనిపై వామపక్షాలతోపాటు విపక్షాలు, విద్యార్థి, ఉద్యోగ, నిరుద్యోగ, వివిధ సంఘాలు నిరసన లె లిపాయి. తర్వాత కోర్టుకు వెళ్లి ధర్నా చౌక్‌ను తిరిగి సాధించుకున్నాయి. ఇక విశేషమేమిటంటే తాను రద్దు చేసిన ధర్నా చౌక్‌లోనే కేసీఆర్‌ ఏడాది క్రితం ధాన్యం కొనుగోలు కోసం ధర్నా చేయడం. ధర్నా చౌక్‌కే అవసరం లేదన్న గులాబీ బాస్‌ అక్కడే దీక్ష చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఢిల్లీలో దీక్ష స్థలం కావాలట..
తెలంగాణలో ధర్నా చౌక్‌ ఎత్తివేసినప్పుడు టీఆర్‌ఎస్‌ ఎంపీగా ఉన్నారు కల్వకుంట్ల వారసురాలు కవిత. ఈమె తండ్రి కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలు ధర్నా చౌక్‌ ఎత్తివేయించారు. కానీ నాడు కవిత నాయనా తెలంగాణ ఆవిర్భవించిందే ఉద్యమాలతోటి.. నువ్వు ధర్నా చౌక్‌ ఎత్తివేయడం సరికాదు నాయనా అని ప్రశ్నించలేదు. ఎత్తివేయొద్దని విపక్షాలు ఆందోళన చేసినా కనీసం మద్దతు తెలుపలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో దీక్ష చేస్తా.. దీక్షకు స్థలం కావాలని అని ఢిల్లీలో కవిత గగ్గోలు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అనుమతి ఇచ్చి నిరాకరణ..
ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద గతంలో కేసీఆర్‌ కూడా దీక్ష చేశారు. తాజాగా కవిత దీక్షకు దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇచ్చారు. ఎలాంటి ఆక్షలు పెట్టలేదు. ధర్నాలు చేయొద్దని అనుమతి నిరాకరించలేదు. కానీ పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో పోరాడే ప్రజాస్వామ్య హక్కునే కేసీఆర్‌ హరిస్తున్నారు. మహిళ అయిన షర్మిల బస్సు యాత్ర చేస్తుంటే తమ నేతలతో బస్సుకు నిప్పు పెట్టించారు. వామనంలో ప్రగతి భవన్‌కు వస్తున్న షర్మిలను కారుతో సహా క్రేన్‌ సాయంతో ఎత్తుకెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో దించారు.

MLC Kavitha Dharna On Delhi
MLC Kavitha Dharna On Delhi

ఇక రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్‌ తమిళిసైకి కేసీఆర్‌ రెండేళ్లుగా కనీసం ప్రొటోకాల్‌ కూడా ఇవ్వడం లేదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆమ పర్యటనకు వెళ్లొద్దని ఆంక్షలు పెట్టారు. వీటిపై ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఏనాడు ప్రశ్నించలేదు. నిరసన తెలుపలేదు. మహిళా గౌరవ్నర్‌ను అసెంబ్లీకి పిలువకుండా కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాడు. మండలిలో సభ్యురాలిగా ఉండి కూడా ఇది అన్యాయమని తెలిసినా మాట్లాడలేదు. విపక్ష నేతల సభలు, సమావేశాలు, దీక్షలపై కేసీఆర్‌ ఉక్కుపాదం మోపారు. చివరకు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులు ధర్నా చేస్తుంటే రాత్రి పోలీసులను పంపించి దీక్ష భగ్నం చేయించిన సందర్భాలు కోకొల్లలు. ఇవన్నీ కవితకు తెలియంది కాదు. కానీ కవిత ఢిల్లీలో తన దీక్షకు ముందు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు స్థలం కుదించుకోమంటున్నారని మీడియా ముందుకు వచ్చి ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌లాగా పోలీసులతో దీక్ష సమయంలో లాక్కెల్లలేదు ఢిల్లీ పోలీసులు, టెంట్లుల కూల్చివేయించలేదు. ఫెక్సీలు చించేయలేదు. అయినా ఈడీ నోటీసుల తర్వాత కవిత ఏదోదో మాట్లాడుతున్నారు. దీక్ష కంటే ఎక్కువ ప్రచార యావపైనే ఆమె దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular