
Sir Movie Records: టాలీవుడ్ లో పని చెయ్యాలని ప్రతీ ప్రాంతీయ బాషా హీరోకి ఉంటుంది.ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు పంచె అభిమానం అలాంటిది మరీ.ఇది వరకే చాలా మంది హీరోలు ఇక్కడ నేరుగా సినిమాలు చేసి సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.ఇప్పుడు తమిళ హీరో ధనుష్ వంతు వచ్చింది..ఆయన హీరో గా నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం ‘సార్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిర్మించాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఫార్చ్యూన్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ద్వారా ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో రాజమౌళి సినిమాలకు కూడా సాధ్యపడని అరుదైన రికార్డు ధనుష్ ‘సార్’ మూవీ దక్కింది.అదేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
అదేమిటంటే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక్క బాహుబలి 2 సినిమాకి తప్ప, ఏ చిత్రానికి కూడా విడుదల ముందు రోజు ప్రీమియర్ షోస్ భారీ రేంజ్ లో పడలేదు.కానీ సార్ మూవీ కి పడింది.ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 35 కి పైగా పడ్డాయి.ఇది ప్రీమియర్ షోస్ లోనే ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.

హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకి 15 కి పైగా ప్రీమియర్ షోస్ పడగా, అన్నీ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.జంట నగరాలలో ఇప్పటి వరకు ఇన్ని షోస్ స్టార్ హీరోలకు కూడా పడలేదు, ఇదే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు.అలా ఈ చిత్రం కేవలం ప్రీమియర్ షోస్ నుండే దాదాపుగా 50 లక్షల గ్రాస్ ని వసూలు చేసిందట.ఇది ఆల్ టైం టాలీవుడ్ రికార్డుగా చెప్పుకోవచ్చు.తెలుగు లో మొదటి సినిమాతోనే ధనుష్ ఇలాంటి రికార్డు పెట్టడం గమనార్హం.