
Sir Movie Twitter Review: వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కింది సార్. సంయుక్త హీరోయిన్ గా నటించగా సముద్ర ఖని కీలక రోల్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది. ఆడియన్స్ ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం.
ఈ మధ్య కాలంలో ధనుష్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడింది లేదు. అయినా ఆయన ఫ్యాన్ బేస్ చెక్కు చెదరలేదని సార్ మూవీ ప్రీమియర్స్ నిరూపించాయి. ఈ చిత్రానికి ఉహించని ఓపెనింగ్స్ దక్కాయి. ధనుష్ సినిమా థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డ్స్ అసలు ఊహించలేదు. ఆ రేంజ్ లో సార్ మూవీ చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సినిమా విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్న మేకర్స్ ప్రెస్ షోలు వేశారు. పలువురు క్రిటిక్స్ మూవీ బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
సగటు ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి అబౌ యావరేజ్ రేటింగ్ ఇస్తున్నారు. సార్ మూవీ కథ అవుట్ డేటెడ్. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం రావాల్సిన స్టోరీ అనేది కొందరు ఆడియన్స్ అభిప్రాయం. మెల్లగా సాగే కథనం, మలుపులు లేని కథ, ఆకట్టుకొని క్లైమాక్స్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి అంటున్నారు. అయితే సోషల్ మెసేజ్, ఎమోషన్స్, కామెడీ, రొమాంటిక్ యాంగిల్ ఓ మేరకు వర్క్ అవుట్ అయ్యాయని ఆడియన్స్ ఒపీనియన్.

ధనుష్ యాక్టింగ్ ఎప్పటిలాగే మెస్మరైజ్ చేస్తుంది. సంయుక్త గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయని సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా అర్థం అవుతుంది. ధనుష్-సంయుక్త కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సాంగ్స్, బీజీఎం తో ఆయన ఆకట్టుకున్నారు. సముద్రఖని యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కీలక రోల్ దక్కించుకున్న ఆయన వంద శాతం న్యాయం చేశాడంటున్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి రొమాంటిక్ చిత్రాల జోనర్ నుండి బయటకు వచ్చి సోషల్ మెసేజ్ మూవీ చేశారు. ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లోపాలు, విద్య వ్యాపారంగా మారితే కలిగే నష్టాలు యధార్థ సంఘటనలతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సబ్జెక్టు బలమైన స్క్రీన్ ప్లే, మెప్పించే సన్నివేశాలతో నడిపి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సోషల్ మీడియా టాక్ ఇలా ఉన్న నేపథ్యంలో… పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితం ఏమిటనేది తెలియదు. చూద్దాం ధనుష్ తెలుగు ఆడియన్స్ ని ఈ మేరకు మెప్పిస్తాడో…
#Vaathi Overall A Decent Commercial Drama!
Though the first half could’ve been better and some parts are over the top, the core emotion works in the film and the 2nd half is crisp with some good blocks. Dhanush gives a good performance in this one. #SIRMovie
Rating: 2.75-3/5
— Venky Reviews (@venkyreviews) February 17, 2023
#VaathiFDFS #SIRMovie just done with movie 🍿, predictable story but griping screenplay, @dhanushkraja acting is major plus point and everyone did there job well. #VenkyAtluri you did best after the #tholiprema , #SIRMovie #Vaathi will be remember forever. 3.5/5 my rating
— Mohan Sai Soma 👑 (@Mohan_TheKing) February 16, 2023
https://twitter.com/VeeraMallu_/status/1626388251027308545