
Ala Vaikunthapurramuloo Hindi Remake: ప్రస్తుతం టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలు కాకుండా కలెక్షన్స్ పరంగా నెంబర్ 1 స్థానం లో ఉన్న చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై సుమారు 165 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ, ఒక్కటి కూడా ఈ సినిమా కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది.
అలాంటి సినిమాని హిందీ లో ‘షెజాడ’ అనే టైటిల్ తో కార్తీక్ ఆర్యన్ ని హీరో గా పెట్టి తీశారు.ఈరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.హిందీ లో కూడా ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించాడు.అయితే ఈ సినిమా అక్కడ అంచనాలను క్రియేట్ చెయ్యడం లో విఫలం అయ్యింది.
ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా అయ్యాయి.ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ రేంజ్ బుకింగ్స్ జరిగాయి.మొదటి రోజు మొత్తానికి కలిపి ఈ సినిమాకి అమెరికా లో కేవలం 500 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయట.కార్తీక్ ఆర్యన్ కి బాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉంది.ఆయన చివరి థియేట్రికల్ రిలీజ్ ‘భూల్ బులియా 2’ కూడా బాక్స్ ఆఫీస్ భారీ హిట్ గా నిలిచింది.అంత పెద్ద హిట్ తర్వాత వచ్చిన సినిమాకి కూడా ఇంత పూర్ రెస్పాన్స్ రావడం ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కి మింగుడు పడడంలేదు.

రీమేక్ సినిమాలను ఈమధ్య బాలీవుడ్ ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు.అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈమధ్యనే బోల్తా కొట్టడం మనం గమనించే ఉంటాము.అవన్నీ చూసిన తర్వాత కూడా రీమేక్ చెయ్యాలనుకోవడం అల్లు అరవింద్ చేసిన పెద్ద పొరపాటే అని చెప్పాలి.