Pranitha Subhash: ప్రముఖ సినీనటి ప్రణీత సుభాష్ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించి మెప్పించింది. తనదైన శైలిలో నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది. అయినా తన గ్లామర్ ను తగ్గకుండా చూసుకుంటోంది. ఓ బిడ్డకు తల్లయినా సరే తన పరువాలను పదిలంగా కాపాడుకుంటోంది. జిమ్ కు వెళుతూ తన సౌష్టవం తరగకుండా చూసుకుంటోంది. మళ్లీ హీరోయిన్ చాన్స్ ఇచ్చినా సరే తన పాత్రకు న్యాయం చేయాలని భావిస్తోంది. కానీ దురదృష్టమేమిటంటే తను చేసిన సినిమాలన్నింటిలో కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలే దొరకడం గమనార్హం.

ఏం పిల్ల.. ఏం పిల్లడో తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తరువాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. చారడేసి కళ్లున్న ఈ అమ్మడు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ నటనలో మాత్రం తనకు మంచి పాత్రలు మాత్రం దక్కలేదు. దీంతోనే ఆమె త్వరగానే కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. వివాహం ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ప్లాన్ చేసినా చివరకు మాత్రం లీక్ కావడంతో అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంది.
బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడింది. అగ్రహీరోలతో నటించినా తగిన పాత్రలు దక్కకపోవడంతో రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. దక్షిణాదిలో కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో నటించింది. హిందీలో హంగామా, భుజ్ వంటి సినిమాల్లో నటించడంతో ఈ సినిమాలు డిస్నీ హాట్ స్టార్ వేదికగా విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రణీత రమణ అవతార సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. బిడ్డ పుట్టిన తరువాత కూడా సినిమాలపై దృష్టి పెట్టడం గమనార్హం.

భవిష్యత్ లో కూడా సినిమాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది. తన కెరీర్ ఇక్కడే ఆగిపోవాలని అనుకోవడం లేదు. ఇక తన గ్లామర్ కూడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓ బిడ్డకు తల్లయినా తనలో ఇంకా హీరోయిన్ రేంజ్ ఉందని నమ్ముతోంది. ఇందుకోసమే తన శరీరాకృతిని మారకుండా చూసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రణీత జిమ్ లో ఎక్సర్ సైజులు చేస్తూ ఇంకా ప్రస్తుత హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చెబుతోంది. ఈ మేరకు ఇంకా అవకాశాలు కావాలని ఆశిస్తోంది. జిమ్ లో ఆమె చేసే ఎక్సర్ సైజులు చూస్తుంటే అభిమానుల మతి పోతోంది. అందరిని ఎంతో రెచ్చగొడుతోంది.
[…] […]