Sir 15 Days Collections: ధనుష్ ‘సార్’ 15 రోజుల కలెక్షన్స్.. త్రివిక్రమ్ కు ఇది షాకింగ్

Sir 15 Days Collections: చాలా రోజుల తరువాత తెలుగు నిర్మాత పంట పండింది. ఇన్నాళ్లు సరైన బ్రేక్ ఈవెన్ లేక ఎదురుచూస్తున్న వారికి ‘సార్’ రూపంలో లాభాల పంట తెచ్చిపెట్టింది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ‘సార్’ను ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజైన 15 రోజుల్లో ఊహించిన దాని కంటే ఎక్కువే వసూళ్లు సాధించింది. ఈ సినిమా తెలుగులోనూ మంచి […]

Written By: Chiranjeevi Appeesa, Updated On : March 4, 2023 4:33 pm
Follow us on

Sir 15 Days Collections

Sir 15 Days Collections: చాలా రోజుల తరువాత తెలుగు నిర్మాత పంట పండింది. ఇన్నాళ్లు సరైన బ్రేక్ ఈవెన్ లేక ఎదురుచూస్తున్న వారికి ‘సార్’ రూపంలో లాభాల పంట తెచ్చిపెట్టింది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ‘సార్’ను ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజైన 15 రోజుల్లో ఊహించిన దాని కంటే ఎక్కువే వసూళ్లు సాధించింది. ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించింది. దీంతో సితార ఎంటర్టైన్మెంట్ అధినేత త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 14 కోట్ల లాభం వచ్చినట్లు సినీ ఇండస్ట్రీ టాక్. ఇంతకీ ‘సార్’ 15 రోజుల్లో ఎంత కలెక్షన్ చేసిందో చూద్దాం.

విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే ధనుష్ లేటేస్టుగా నటించి రిలీజైన చిత్రం ‘సార్’.. ఈ సినిమా పై ప్రారంభం నుంచి అంచనాలు ఎక్కువగా ఉండడంతో హక్కుల కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్స్ దక్కించుకోవడానికి పలు నిర్మాణ సంస్థలు ముందుకు రావడంతో మొత్తంగా రూ.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయింది. ఆ తరువాత రిలీజైన తరువాత ప్రతీరోజూ వసూళ్ల పంట పండించింది.

‘సార్’ చిత్రానికి 15 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎలా ఉందంటే.. నైజాంలో రూ.6.97 కోట్లు, సీడెడ్ లో రూ.2.45 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ.2.46 కోట్లు, సీడెడ్ లో రూ.2.45 కోట్లు, ఈస్ట్ లో రూ.1.57 కోట్లు, వెస్ట్ లో రూ.69 లక్షలు, గుంటూరులో రూ.1.29 కోట్లు, కృష్ణాలో రూ.1.13 కోట్లు, నెల్లూరులో రూ.63 లక్షలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.1.28 కోట్లు. ఇలా మొత్తంగా 15 రోజుల్లో ఈ సినిమా తెలుగులో 18.47 కోట్ల షేర్ చేయగా.. గ్రాస్ కలెక్షన్లు రూ.34.90 కోట్లు వసూళ్లు చేసింది.

Sir 15 Days Collections

ఈ సినిమా తెలుగు వర్షన్ కు ఆదరణ ప్రపంచవ్యాప్తంగా తగ్గలేదు. వరల్డ్ వైడ్ గా రూ.6.20 కోట్లు రాబట్టడం విశేషం. మొత్తంగా 11.77 కోట్ల లాభాల మార్క్ ను దాటడంతో రికార్డును షేర్ చేసింది. ఇక తమిళ వెర్షన్లో ఈ సినిమాకు రూ.50.50 కోట్లు షేర్ చేయగా.. 97.14 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓవరాల్ గా రూ.50.50 కోట్ల షేర్ వచ్చింది. దీంతో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన తివిక్రమ్ శ్రీనివాస్ కు రూ.14.50 కోట్ల లాభాలు వచ్చాయి.

Tags