
Devi Sri Prasad Wedding: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ‘దేవి’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయన మొన్నటి ‘వాల్తేరు వీరయ్య ’ వరకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ను అందించారు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ చిరంజీవి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని కోరుకుంటున్నారంటే ఆయన గుర్తింపు ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడంలో ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోలందరికీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. కేవలం మ్యూజిక్ మాత్రమే కాకుండా తన గానంతో శ్రోతలను ఇంప్రెస్ చేస్తాడు. అయితే ఇటీవల దేవిశ్రీప్రసాద్ సినిమాలు తక్కువ అయ్యాయి.
ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా దేవి శ్రీ ప్రసాద్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ మధ్య ఓ హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడిపారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత వీరు దూరమయ్యరని అన్నారు. అయితే తాజాగా ఈయన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారట. ఇంతకీ ఆమె ఎవరంటే?
కొన్ని సంవత్సరాలుగా దేవిశ్రీ ప్రసాద్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన ఓ హీరోయిన్ తో లవ్ ట్రాక్ లో ఉన్నారని అన్నారు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటారని చెప్పారు. కానీ ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాకుండా తాను ఎవరిని లవ్ చేయలేదని అన్నారు. కానీ ఇంతకాలం ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఏదో ఉందని కొందరు పోస్టులు పెట్టారు.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మెరిసే ఈయన గురించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని మరోసారి న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈసారి లవ్ ట్రాక్ కాకుండా తన బంధువుల్లో ఒకరు మరదలు వరుస అయ్యే ఒకామెను దేవిశ్రీ చూసి ఇష్టపడ్డారట. ఆమెను పెళ్లిచేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాడట. కానీ ఈ విషయాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ఇప్పుడైనా దేవిశ్రీ ప్రసాద్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తాడా? లేదా? చూడాలి.