Devi Nagavalli: దేవి నాగవల్లి.. పరిచయం అక్కరలేని పేరు. న్యూస్ రీడర్‌గా బాగా పాపులర్ అయిన దేవి నాగవల్లి.. బిగ్‌బాస్ సీజన్ 3లో అనూహ్యంగా అవకాశం దక్కించుకుంది. దీంతో మరింత పాపులర్ అయింది. అయితే వాటికంటే ఇటీవల వర్ధమాన సినీ హీరో విశ్వక్‌సేన్‌తో పెట్టుకునన గొడవతో మరింత పాపులర్ అయ్యారు. ఆ గొడవతో విశ్వక్‌సేన్ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఓ దశలో విశ్వక్‌సేన్ రియల్ హీరో అయ్యాడు. టీవీ–9 స్టూడియోలో జరిగిన గొడవ విషయంలో నెటిజన్లు విశ్వక్‌సేన్‌కే మద్దతుగా నిలిచారు. దేవి నాగవల్లి చేసిందే తప్పని చాలా మంది ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేశారు. అయితే ఇప్పటికి ఆ వివాదం దేవిని వెంటాడుతూనే ఉంది. ఆమెపై ట్రోల్స్ ఆగడం లేదు. విషయం ఏదైనా మధ్యలోకి దేవి నాగవల్లిని తీసుకువస్తూ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇక ఇటీవలే జబర్దస్త్ షోలోనూ దేవి నాగవల్లి టైప్‌లో పొట్టి నరేష్ గెటవుట్ అంటూ సందడి చేశాడు. తాజాగా ప్రముఖ యాంకర్ సుమ కూడా దేవి డైలాగ్స్‌ను వాడేసుకున్నారు. మొత్తంగా సీరియస్ డైలాగ్.. చివరికి ఇలా కామెడీగా మారిపోయింది.

ఊతపదంగా మారిన దేవి డైలాగ్..
దేవి నాగవల్లి టీవీ–9 స్టూడియోలో వర్దమాన హీరో విశ్వక్‌సేన్‌తో జరిగిన గొడవ సందర్భంగా హీరోను ఉద్దేశించి న్యూస్ రీడర్ అన్న గెటవుట్ అనే ఇప్పుడు చాలా మంది ఊతపదంగా మార్చుకున్నారు. చాలా మంది ఆ డైలాగ్‌తో ఆమెను ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు. మొన్న జబర్‌దస్త్‌లో పొట్టి నరేష్ దేవి డైలాగ్‌లో స్కిట్ చేయగా, తాజాగా రిలీజ్ చేసిన క్యాష్ షో ప్రోమోలోనూ దేవి నాగవల్లి డైలాగ్‌ను సుమ ఇమిటేట్ చేసింది.
Also Read: Dil Raju Comments On SVP: సర్కారు వారి పాట ఫేక్ కలెక్షన్స్ పై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు డేగల బాబ్జీ టీమ్ హాజరు కాగా.. వారిలో బండ్ల గణేశ్, సమీర్ తదితరులు ఉన్నారు. అయితే ఓ దశలో సమీర్‌ను ఉద్దేశించి సుమ.. గెటవుట్ అని యాంకర్ దేవి నాగవల్లి డైలాగ్‌ను చెబుతుంది. దీంతో సమీర్ కూడా మీరు నన్ను ఎలా బయటకు పంపిస్తారు? అని ప్రశ్నిస్తాడు. చివరకు బండ్ల గణేశ్ జోక్యం చేసుకుని ‘ఈటీవీ శాశ్వతం.. క్యాష్ షో శాశ్వతం.. సుమ శాశ్వతం కాదు’ అంటూ డైలాగ్ కొడతాడు. దీంతో షోలో నవ్వులు విరిశాయి. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ ఈ నెల 28న ప్రసార కానుంది. ఈ ప్రోమోను చూస్తే క్యాష్ లేటెస్ట్ ఎపిసోడ్ నవ్వులను పంచుతుందని అర్థమవుతోంది.

మొత్తంగా దేవి నాగవల్లి ఇలా గొడవలో ఇరుక్కోవడం ఏమోగానీ.. పదే పదే ఇలా ఆమె వాడిన డైలాగ్‌తో టార్గెట్ చేస్తున్నారు. ఇక చివరకు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అంత సీరిసయ్ గొడవ చివరకు ఇలా కామెడీగా మారడమే ఇక్కడ విచిత్రం!!
[…] Also Read: Devi Nagavalli: దేవిని వెంటాడుతున్న ఆ డైలాగ్.. … […]
[…] Read:Devi Nagavalli: దేవిని వెంటాడుతున్న ఆ డైలాగ్.. … Recommended […]