Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma- Cheating Case: వర్మ పై 420 కేసు.. అలాగే మరో మూడో...

Ram Gopal Varma- Cheating Case: వర్మ పై 420 కేసు.. అలాగే మరో మూడో కేసులు కూడా !

Ram Gopal Varma- Cheating Case: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మకి నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే, ఈ మధ్య వర్మ పై కొత్త రకం కేసులు కూడా నమోదు అవుతున్నాయి. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడట.

Ram Gopal Varma- Cheating Case
Ram Gopal Varma

అయితే, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడట వర్మ. శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు. ఇదే విషయంపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోడూ కూడా అయ్యింది. దిశ అనే సినిమా నిర్మించేదుకు గాను 56 లక్షలు వర్మ తీసుకున్నాడట. మొత్తానికి ఆ డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డాడు.

Also Read: Devi Nagavalli: దేవిని వెంటాడుతున్న ఆ డైలాగ్‌.. చివరికి కామెడీగా మారిన సీరియస్‌ వార్నిగ్‌

దాంతో శేఖర్ రాజు, వర్మపై ఫిర్యాదు చేశాడు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 406, 417, 420, 506 సెక్షన్ల కింద వర్మపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అన్నట్టు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు ఇవ్వాల్సిన రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని.. నిర్మాత నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Ram Gopal Varma- Cheating Case
Ram Gopal Varma

నట్టి కుమార్ తో గతంలో వర్మ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఆ సినిమాలు ఏవీ ఆడలేదు. మరి వీరిద్దరూ మధ్య ఏ ఒప్పందం జరిగిందో తెలియదు. వర్మ ప్రతి సినిమాకు నట్టి కుమార్ కి రూ.50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయట. ఇప్పుడు ఆ నిబంధనలు పాటించడం లేదని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు.

అలాగే, మరికొందరు కూడా వర్మ పై ఇలాంటి కేసులు పెడుతున్నారు. అసలు వర్మ పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతుంది. మరి చివరకు వర్మ ఏ స్థాయికి దిగజారి పోతాడో చూడాలి.

Also Read:Pawan-Mahesh Multistarrer: 8 ఏళ్ళ క్రితమే ప్రారంభం అవ్వాల్సిన పవన్ – మహేష్ మల్టిస్టార్రర్ మూవీ అందుకే ఆగిపోయిందా..?
Recommended videos
అప్పుడు పవన్ ఇప్పుడు అకిరా || Akira Participate In Green India Challenge || Oktelugu Entertainment
HILARIOUS Video Ever | F3 Team Reels Imitation At F3 Pre Release Event | Hero Venkatesh | Varun Tej
Rakul Preet Singh With SUPER Cool Looks with Boyfriend || Rakul Preet Boy Friend Jackyy Bhagnani

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version