
Sandeep Sharma- MS Dhoni: ఐపీఎల్ సీజన్ 16 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. క్రికెట్ అభిమానులు ఆశించేది కూడా ఇదే. ప్రతీ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగుతోంది. భారీ స్కోర్లు కూడా చిన్నబోతున్నాయి. చివరి ఓవర్‌లో విజయం మారిపోతోంది. ఛేజింగ్ లో ధోనీ చివరి వరకు ఉంటే అవతల ఎంతటి బౌలర్ అయినా హడలిపోవాల్సిందే.. అయితే అతను మాత్రం చివరి బంతి ఎవరూ కొట్టలేనట్లు వేశాడు.. రాజస్థాన్ టీమ్‌కు అదిరిపోయే విజయం అందించాడు.
ఛేజింగ్‌లో ధోనీకి గుర్తింపు..
ఐపీఎల్ లో ధోనీకి అదిరిపోయే రికార్డులున్నాయి.. చెప్పాలంటే ఛేజింగ్‌లో ధోనీని మించిన ఐపీఎల్ బ్యాటర్ లేడు.. లాస్ట్ ఓవర్ లో 20 కంటే ఎక్కువ పరుగులు కొట్టాలన్న ధోనీ ఉంటే చెన్నై గెలిచేసినట్లే.. గతేడాది ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లోనూ ధోనీ లాస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టి చెన్నైను గెలిపించాడు.. ఇక తాజాగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ అదే ఫీట్ చేస్తాడని ఫ్యాన్స్ భావించారు.
ధోనీ ఉంటే బౌలర్‌కు వణుకే..
క్రీజ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్నాడంటే.. అతనికి బౌలింగ్ చేసే బౌలర్‌కు కాస్త భయం ఉంటుంది. ఇక విజయాన్ని నిర్దేశించే చివరి ఓవర్ వేసే బౌలర్ అయితే వణుకు పుడుతుంది. అంటే క్రీజులో ఉంటే బౌలర్‌పై ప్రెజర్ ఉంటుంది.. దాని తట్టుకోని లైన్‌లో బౌలింగ్ వేయడం చాలా కష్టం. గతంలో మేటీ బౌలర్లు సైతం ధోనీ దెబ్బకు చివరి ఓవర్లో హడలిపోయారు.. లయా తప్పిన బంతులు వేసి ఫుల్ టాస్‌లతో కొట్టించుకున్నారు..
సందీప్ నువ్వు తోపు పో..
రాజస్థాన్ బౌలర్ సందీప్‌శర్మ కూడా లాస్ట్ ఓవర్‌లో రెండు వైడ్లు, రెండు ఫుల్ టాస్‌లు వేశాడు.. ఇంకేముంది.. చివరి మూడు బంతులు కూడా అలానే వేస్తాడని.. ధోనీ సిక్సర్‌తో మ్యాచ్ గెలిపిస్తాడని ఫ్యాన్స్ ఊహించుకున్నారు. అయితే లాస్ట్ త్రీ బాల్స్ సందీప్‌శర్మ ఎవరూ సిక్స్ కొట్టలేని లెవల్‌లో వేశాడు. చివరి మూడు బంతుల్లో చెన్నై విజయానికి 7 పరుగులే అవసరమవ్వగా.. సందీప్‌శర్మ అద్భుతమైన యార్కర్లతో మూడు పరుగులే ఇచ్చి రాజస్థాన్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

6 బంతులు 21 పరుగుల లక్ష్యం..
ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. సందీప్‌శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు వైడ్లు వేసి తర్వాతి బంతిని డాట్ చేశాడు. తర్వాత వరుసగా రెండు సిక్స్‌లు బాదిన ధోనీ తర్వాత ఓ సింగిల్ తీశాడు. చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. జడేజా సింగిల్ తీశాడు. చివరి బంతికి కూడా సింగిలే రావడంతో రాజస్థాన్ విజయం లాంఛమైంది.
తీవ్ర ఒత్తిడిలోనూ సందీప్‌శర్మ యార్కర్ లెంగ్త్ బౌలింగ్ వేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనీనే నిలువరించావ్.. నువ్వు తోప్పుపో అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.