Holi Girls : రంగులు పూసుకుంటూ పబ్లిక్ గా ఆ పని.. బాబోయ్ వీళ్ళసలు అమ్మాయిలేనా?

ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆ యువతులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆడవాళ్ళుగా పుట్టి ఇలాంటి పనులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : March 25, 2024 6:07 pm

Delhi Metro told video of these girls playing Holi inside Metro

Follow us on

Holi Girls : హోలీ అంటే.. రంగుల వేడుక.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందించే వేడుక. కానీ ఆ ఆనందంలో వీరు మరో దానిని వెతుక్కున్నారు. సభ్య సమాజంలో ఉన్నామనే సోయిని మర్చిపోయారు. చుట్టూ మనుషులు ఉన్నారనే ఇంగితాన్ని పక్కన పెట్టారు. ఇలా నడి బజార్లో వికృత చేష్టలకు పాల్పడితే ఇంట్లో వాళ్ళ పరువు ఏమవుతుందోననే విషయాన్ని మర్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఆ పని కానిచ్చారు.. దీంతో వారిద్దరిపై సోషల్ మీడియాలో పెద్ద పెట్టున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ వారు ఏం చేశారంటే..

ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు రంగులు పూసుకుంటూ నానా రచ్చ చేశారు. ఇద్దరూ 20 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉంటారు. ఢిల్లీ మెట్రో ఎక్కి.. ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. అది అక్కడ వరకే ఆగితే బాగుండేది. ఒకరి ఒడిలో మరొకరి పడుకొని రంగులు పూసుకొని, ముద్దులు ఇచ్చుకున్నారు. దీన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. పెంట పెంట అయింది. అయితే ఈ వీడియోను కొంతమంది డీప్ ఫేక్ గా కొట్టి పడేస్తే.. మరి కొంతమంది అది నిజమని నిరూపించారు. అయితే మెట్రో అధికారులు ఆ ఇద్దరి యువతులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియ రాలేదు. కానీ ఆ వీడియో మాత్రం అటు మీడియా, ఇటు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ విషయం మర్చిపోకముందే.. మళ్లీ అదే యువతులు హోలీ పండుగ నాడు మరింత రచ్చ చేశారు.

ఢిల్లీలోని నోయిడాలో ఓ యువకుడు స్కూటీ నడుపుతుండగా.. ఆ ఇద్దరికి యువతులు ఒకరికి ఎదురుగా మరొకరు కూర్చున్నారు. రంగులు పూసుకుంటూ.. రాయడానికి వీలు లేనివిధంగా వ్యవహరించారు. వారిద్దరి వాలకం చూసిన మిగతావారు కళ్ళు మూసుకున్నారు.. ఆ బైక్ మీద నుంచి దిగి రోడ్డు మీద ఒకరిపై ఒకరు పడుకొని రంగులు పూసుకున్నారు. చండాలమైన పనులు చేశారు.. ఆ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆ యువతులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆడవాళ్ళుగా పుట్టి ఇలాంటి పనులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.”ఆ యువతులు చేస్తున్న పని దరిద్రంగా ఉంది. చూసేందుకు విరక్తి కలుగుతుంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా” అంటూ నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు ఆ యువతులను పట్టుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.