https://oktelugu.com/

Deepthi Sunaina – Shanmukh Jaswanth : లైఫ్ లాంగ్ నిన్ను లవ్ చేయలేను… షణ్ముఖ్ టార్గెట్ గా దీప్తి సునైన షాకింగ్ వీడియో!

Deepthi Sunaina – Shanmukh Jaswanth : బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. నేను నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమించలేనంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో మాజీ లవర్ షణ్ముఖ్ గురించే అంటూ నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ విడిపోయిన సంగతి తెలిసిందే. 2021లో దీప్తి అధికారిక ప్రకటన చేసింది. షణ్ముఖ్ తో కలిసి ఉండేది లేదు. ఇకపై నా జీవితం నాది. నా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2023 / 08:39 PM IST
    Follow us on

    Deepthi Sunaina – Shanmukh Jaswanth : బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. నేను నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమించలేనంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో మాజీ లవర్ షణ్ముఖ్ గురించే అంటూ నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ విడిపోయిన సంగతి తెలిసిందే. 2021లో దీప్తి అధికారిక ప్రకటన చేసింది. షణ్ముఖ్ తో కలిసి ఉండేది లేదు. ఇకపై నా జీవితం నాది. నా దృష్టి పూర్తిగా కెరీర్ మీద పెడతాను అంటూ ఓ వీడియో విడుదల చేసింది.

    షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ సిరికి దగ్గరయ్యాడు. సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్-సిరి చివరి వరకు స్ట్రాంగ్ బాండింగ్, రిలేషన్ మైంటైన్ చేశారు. స్నేహితులమని చెప్పుకుంటూ ముద్దులు, హగ్గులు లాగించేశారు. వీరి బాగోతం బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యింది. నేను పక్కన లేకపోయేసరికి మరొక అమ్మాయికి దగ్గరయ్యాడని ఆమె ఆగ్రహానికి గురయ్యారు. అందుకే బ్రేకప్ చెప్పారనేది టాలీవుడ్ వర్గాల వాదన.

    తర్వాత జరిగిన పరిణామాలు ఇదే నిజమని రుజువు చేశాయి. ఇటీవల సిరి తన తప్పు ఒప్పుకున్నారు. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు. నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశానంటూ అందరి ముందు అంగీకరించింది. సిరి లవర్ శ్రీహాన్ ఆమె ఎమోషనల్ కాగా ఓదార్చారు. బిగ్ బాస్ హౌస్లో షణ్ముఖ్ కి తాను దగ్గరైన మాట నిజమే అని ఆమె చెప్పకనే చెప్పారు. ఇక విడిపోయిన షణ్ముఖ్-దీప్తి మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఒకరికి గుచ్చుకునేలా మరొకరు వీడియోలు చేసి పెడుతున్నారు.

    తాజాగా దీప్తి ‘ఆరెంజ్’ మూవీలో రామ్ చరణ్-జెనీలియా మధ్య జరిగిన సన్నివేశాన్ని డబ్స్మాష్ చేసింది. ఒక రొమాంటిక్ అండ్ ఎమోషనల్ డిస్కషన్ తాను నటించి చూపించారు. అప్పట్లో డబ్స్మాష్ కోసం బట్టీ పట్టిన డైలాగ్స్ అంటూ… సదరు వీడియోకి కామెంట్ జోడించారు. అయితే ఈ వీడియోతో ఇండైరెక్ట్ గా షణ్ముఖ్ ని టార్గెట్ చేసిందని నెటిజెన్స్ భావిస్తున్నారు. మొత్తంగా దీప్తి సునైన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు షణ్ముఖ్ అందమైన అమ్మాయిలతో డాన్స్ వీడియోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ దీప్తిని ఉడికిస్తున్నాడు.