
Deepthi Sunaina: దీప్తి సునైనా ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఆమె తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ కి గుడ్ బై చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేశాడు. షణ్ముఖ్-సిరి హద్దులు దాటి వ్యవహరించారు. ఇవన్నీ బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యారు. షణ్ముఖ్ హౌస్ నుండి బయటకు వచ్చే వరకు మౌనం వహించింది. కొద్దిరోజుల తర్వాత షణ్ముఖ్ ని వదిలేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. షణ్ముఖ్ తో నాకున్న లాంగ్ రిలేషన్షిప్ కి బ్రేక్. మేమిద్దరం విడిపోతున్నామని పోస్ట్ పెట్టారు.
2021లో జరిగిన ఈ పరిణామం సంచలనం రేపింది. దీప్తి బ్రేకప్ కి ఎలాంటి కారణాలు చెప్పలేదు. అయితే సిరినే కారణమన్న ప్రచారం జరిగింది. షణ్ముఖ్-దీప్తి మధ్య కోల్డ్ వార్ నడిచింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఇండైరెక్ట్ పోస్ట్స్ పెట్టేవారు. ఇక విడివిడిగా తమ కేరీర్లో బిజీ అయ్యారు. ఇటీవల దగ్గరవుతున్నట్లు కనిపించారు. ఇద్దరూ కలిసి కామన్ ఈవెంట్స్ చేశారు.
దీప్తి పుట్టినరోజు నాడు షణ్ముఖ్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఒకింత ఆనందం వ్యక్తం చేశారు. కారణం వీరిద్దరి యూట్యూబ్ వీడియోలకు మంచి డిమాండ్ ఉంది. అలాగే వీడియో సాంగ్స్ ఇరగదీస్తారు. విడిపోవడం వలన ఇద్దరూ సమానంగా నష్టపోయారు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయారు. కాగా త్వరలో వీరి కలిసి నటిస్తారనే ప్రచారం జరుగుతుంది.

కాగా దీప్తి సునైన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కొత్త అనుమానాలకు దారితీసింది. ”ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే…” అంటూ ఆహ్లాదంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దీప్తి కామెంట్ తో పాటు ఫోటోలలో ఆనందం చూసిన నెటిజన్స్ ఆమె లవ్ లో పడ్డారని అంటున్నారు. తనకు కొత్త తోడు దొరికింది, అతని కోసమే ఈ విరహ వేదన అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటుంది. జంటను వెతుక్కొని ఉంటారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది షణ్ముఖ్ కూడా కావచ్చన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా దీప్తి నెటిజన్స్ మనస్సులో కొత్త సందేహం నాటింది.
View this post on Instagram