https://oktelugu.com/

Shanmukh Deepthi Sunaina Breakup: చక్కటి ప్రేమాయణంలో ‘బిగ్ బాస్’ చిచ్చు.. అక్కడే షణ్ముక్, దీప్తి రిలేషన్‌కు బ్రేకులు..!

Shanmukh Deepthi Sunaina Breakup: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోను చూసేందుకును ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఇకపోతే ఈ రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ తర్వాత బాగా పాపులర్ అయ్యారు కూడా. కానీ, ఇటీవల ముగిసిన సీజన్ ఫైవ్ మాత్రం ఓ ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టిందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. సీజన్ ఫైవ్ కంటెస్టెంట్‌గా […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 2, 2022 / 12:33 PM IST
    Follow us on

    Shanmukh Deepthi Sunaina Breakup: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోను చూసేందుకును ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఇకపోతే ఈ రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ తర్వాత బాగా పాపులర్ అయ్యారు కూడా. కానీ, ఇటీవల ముగిసిన సీజన్ ఫైవ్ మాత్రం ఓ ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టిందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు.

    Shanmukh Deepthi Sunaina Breakup

    సీజన్ ఫైవ్ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పార్టిసిపేట్ చేసిన సంగతి అందరికీ విదితమే. రన్నరప్‌గా నిలిచిన షణ్ణు హౌజ్‌లో చేసిన చేష్టలు అందరికీ గుర్తుండే ఉంటాయి. సిరితో ఫ్రెండ్ షిప్ అంటూనే హగ్స్, కిస్సెస్, దుప్పట్లో దూరిపోవడాలు అందరూ చూసే ఉంటారు. కాగా, అది ఆయన కొంపముంచింది. తనకు గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయిన ఉన్నప్పటికీ సిరితో షణ్ముక్ జస్వంత్ రిలేషన్‌లో పడిపోయాడా, అందుకు ట్రై చేస్తున్నాడా అనేంత రేంజ్‌లో వారిరువురు హౌజ్ లో రెచ్చిపోయారు.

    సిరి హన్మంత్ సైతం తనకు శ్రీహాన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ షణ్ణుతో చాలా క్లోజ్‌గా మూవ్ అయింది. ఈ క్రమంలోనే అలా కథ ముగిసింది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముక్ జస్వంత్, దీప్తి సునయిన, సిరి హన్మంత్, శ్రీహాన్ మునుపటి లాగే కలిసి ఉంటారునుకున్నారు. అయితే, దీప్తి సునయిన మాత్రం షణ్ముక్‌తో కలిసేందుకు ఇష్టపడలేదట. హౌజ్‌లో సిరి, షణ్ణుల మధ్య క్లోజ్‌నెస్‌ చూసి ఆమె గుండె బద్ధలైంది. అందుకే, బ్రేకప్‌ చెప్పేసిందట.

    Also Read: విడిపోతూ కూడా ప్రేమను కురిపించేస్తే ఎలా ?

    అలా ఐదేళ్ల బంధానికి ‘బిగ్ బాస్’ వలన బ్రేకప్ వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఇందులో ‘బిగ్ బాస్’ చేసిందేమీ లేదని, చేతులారా షణ్ముక్ జస్వంతే తన లైఫ్‌ను మార్చేసుకున్నాడని సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఔను వాళ్లిద్దరూ బ్రేకప్ చేప్పేసుకున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతున్నది కూడా.

    దీప్తి సునయిన, షణ్ముక్ జస్వంత్ గతంలో చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉండేదన్న సంగతి అందరికీ తెలుసు. వారిరువురు చాలా కాలం పాటు షార్ట్ ఫిల్మ్స్ కాలం నుంచి అసోసియేట్ అయి ఉన్నారు. షణ్ముక్ ‘ద సాఫ్ట్ వేర్ డెవలపర్’ యూట్యూబ్ సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతనికి ‘బిగ్ బాస్’ పార్టిసిపేషన్ చాన్స్ వచ్చింది. కానీ, అదే చాన్స్ అతని లవ్ స్టోరికి అడ్డుగా మారింది.

    Also Read: షన్ను-దీప్తి ప్రేమలో సిరి చిచ్చు.. బ్రేకప్ దిశగా రిలేషన్? ఆ పోస్ట్స్ మీనింగ్ అదేనా?

    Tags