https://oktelugu.com/

Sharukh Khan Movie : తండ్రీ కోసం దీపిక పడుకొణే, కొడుకు కోసం నయనతార

Sharukh Khan Movie :  షారుఖ్ ఖాన్. ఈ బాలీవుడ్ బాద్ షా హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు. షారుఖ్ కు ఒక్క హిట్ లేక కొన్ని సంవత్సరాలు అవుతోంది. అప్పుడు ఎప్పుడో 2013లో వచ్చిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మూవీ తర్వాత అంతటి హిట్ మళ్లీ పడింది లేదు. ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కలెక్షన్లు కోల్పోయి భారీ లాస్ తో షారుఖ్ కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. అందుకే బాలీవుడ్ దర్శకులను […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2022 / 08:46 PM IST
    Follow us on

    Sharukh Khan Movie :  షారుఖ్ ఖాన్. ఈ బాలీవుడ్ బాద్ షా హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు. షారుఖ్ కు ఒక్క హిట్ లేక కొన్ని సంవత్సరాలు అవుతోంది. అప్పుడు ఎప్పుడో 2013లో వచ్చిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మూవీ తర్వాత అంతటి హిట్ మళ్లీ పడింది లేదు. ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కలెక్షన్లు కోల్పోయి భారీ లాస్ తో షారుఖ్ కెరీర్ ప్రమాదంలో పడిపోయింది.

    అందుకే బాలీవుడ్ దర్శకులను వదిలేసి తాజాగా దక్షిణాది దర్శకుల స్టామినాపై పడ్డారు షారుఖ్ ఖాన్. ఈ క్రమంలోనే తమిళ సక్సెస్ ఫుల్ దర్శకుడు అట్లీని నమ్ముకున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

    ఆసక్తికర విషయం ఏంటంటే.. షారుఖ్ ఖాన్ పక్కన ఇద్దరు పెళ్లైన టాప్ హీరోయిన్లు నటిస్తుండడమే ఆసక్తి రేపుతోంది. షారుఖ్ ఖాన్ తండ్రీ కొడుకులుగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. తండ్రి షారుఖ్ పక్కన దీపిక పడుకొణే నటిస్తుండగా.. కొడుకు షారుఖ్ పక్కన నయనతార నటిస్తోంది. ఈ మేరకు త్వరలోనే వీరిద్దరితో తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు చిత్రం యూనిట్ తెలిపింది.

    రాబోయే షెడ్యూల్ లో దీపిక-షారుఖ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘జవాన్’ అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

    దీపిక పడుకొణే, నయనతార ఒక్కక్కరూ రెండు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు. దీపిక కర్ణాటక నుంచి వెళ్లి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక నయనతార తమిళనాడు నుంచి దక్షిణాదిలోనే అగ్రహీరోయిన్ అయ్యింది. ఇద్దరిదీ దక్షిణాది కావడం.. ఇక్కడి భాష తెలియడంతోనే దర్శకుడు అట్లీ వీరిద్దరినీ షారుఖ్ పక్కన హీరోయిన్లుగా ఎంపిక చేసినట్లు సమాచారం. దాదాపు సీనియర్ నటులందరితో నటించిన టాప్ హీరోయిన్లనే అట్లీ షారుఖ్ పక్కన ఎంపిక చేసుకోవడం విశేషం.