Homeఆంధ్రప్రదేశ్‌Hari Rama Jogaiah: జగన్ మెడకు ‘కాపు’ ఉచ్చు.. ఈసారి రగిలిస్తున్న ‘జోగయ్య’

Hari Rama Jogaiah: జగన్ మెడకు ‘కాపు’ ఉచ్చు.. ఈసారి రగిలిస్తున్న ‘జోగయ్య’

Hari Rama Jogaiah: కాపులను అణచివేసిన ఏ ప్రభుత్వం, Oఏ పార్టీ నెగ్గినట్టు ఏపీ చరిత్రలో లేదు. ఉమ్మడి ఏపీలోనూ.. అవశేష ఆంధ్రప్రదేశ్ లోనూ పలుమార్లు ఇదే రుజువైంది. వంగవీటి రంగా హత్య అనంతరం ఇప్పటివరకూ ఐదు సార్లు ఎన్నికలు జరగగా… ప్రతీసారి కాపు ఫ్యాక్టర్ ఓటు పనిచేసింది. అధికార పార్టీని గద్దె దించింది. 1988 లో వంగవీటి మోహన్ రంగా హత్య అనంతరం కాపులను టీడీపీ ప్రభుత్వం అణిచివేసిందన్న ఆరోపణ ఎదుర్కొంది. ఆ తరువాత సంవత్సరం వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం పొందింది. అటు తరువాత వచ్చిన ఎన్నికల్లో కాపులు ఎటు మొగ్గితే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ముద్రగడ నేతృత్వంలోని కాపుల రిజర్వేషన్ ఉద్యమాన్ని చంద్రబాబు సర్కారు అణచివేసింది. దీంతో ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆ వంతు జగన్ కు వచ్చినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల తరువాత అధికారం చేపట్టిన జగన్ కాపులను దారుణంగా వంచించడమే ఇందుకు కారణం.

Hari Rama Jogaiah
Hari Rama Jogaiah

జగన్ బాధిత సామాజికవర్గంలో కాపులదే అగ్రస్థానం. ఏ కాపులకు కాళ్లావేళ్లా పడి అధికారంలోకి వచ్చారో.. అదే కాపులను అణచివేసేందుకు జగన్ ప్రయత్నించారు. అందుకు రాజకీయ కారణాలు చూపుతూ నాలుగేళ్ల పాటు పబ్బం గడుపుకున్నారు. అంతకు ముందు కాపులకు ఉన్న పథకాలను, ప్రత్యక రాయితీలను రద్దు చేశారు. చంద్రబాబు ఇచ్చిన 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లను సైతం రద్దుచేశారు. సామాజికపరంగా కూడా దెబ్బతీశారు. పేరుకే మంత్రి పదవులు ఇచ్చారు. అధికారాన్ని మాత్రం తన అస్మదీయులకు కట్టబెట్టారు. ఎన్నికల ముందు వంగవీటి మోహన్ రంగాను ఆకాశానికి ఎత్తేశారు. ఎన్నికల తరువాత రంగా విగ్రహానికి పూలమాలలు వేసేందుకు కూడా ఇష్టపడలేదు. రంగాను తూలనాడిన గౌతం రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి కట్టబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాపులకు జగన్ అడుగడుగునా అన్యాయం చేశారు.

గత ఎన్నికలకు ముందు కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమించారు. కాపు జాతిని ఏకం చేయగలిగారు. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అప్పటి చంద్రబాబు సర్కారును ముచ్చెమటలు పట్టించారు. అయితే కాపు ఉద్యమాన్ని విపక్ష నేతగా ఉన్న క్యాష్ చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వంపై విధ్వేషాలను రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. తుని రైలు దహనం వెనుక ఉన్నది అప్పటి విపక్షం, ఇప్పటి అధికార పక్షం వైసీపీయేనని.. వారంతా కడప నుంచి వచ్చిన గూండాలే అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఎలా అయితేనేం నాటి చంద్రబాబు సర్కారు దిగి వచ్చింది. కాపుల రిజర్వేషన్ల అధ్యయనానికి మంజునాథ కమిషన్ ను ఏర్పాటుచేసింది. అటు తరువాత టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడం, శాసనసభలో ఆమోదించడం జరిగిపోయింది. గవర్నర్ ఆమోదంతో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. విద్యాసంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలయ్యాయి. తీరా అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు చట్టబద్ధత కావని జగన్ రద్దుచేయడం, మూడున్నరేళ్లుగా పట్టించుకోకపోవడం మనం చూసిందే. అదే సమయంలో తన ఉద్యమాన్ని అనుమానపు చూపులు చూస్తున్నారన్న కారణం చెప్పి ముద్రగడ కూడా మధ్యలో రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపివేసి ఇంటికి పరిమితమయ్యారు.

Hari Rama Jogaiah
Hari Rama Jogaiah

అయితే కాపు రిజర్వేషన్ల ప్రక్రియ, ఉద్యమం ఎక్కడ నిలచిపోయిందో.. అక్కడ నుంచి కొనసాగించాలని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య నిర్ణయించారు. సీఎం జగన్ కు లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లపై సరైన నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇచ్చారా సరా.. లేకుంటే ఉద్యమాన్ని మొదలుపెడతానని అల్టిమేటం ఇచ్చారు. ఈ నెల 31ని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ఈ నెల 26న విశాఖ వేదిక జరగనున్న కాపునాడు సమావేశంలో కూడా కాపు రిజర్వేషన్ల అంశం కాక రేపే అవకాశం ఉంది. అయితే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో జోగయ్య ఉన్నారు సో ఈసారి జగన్ మెడకు కాపు రిజర్వేషన్ల ఉచ్చును జోగయ్య తగిలించనున్నారన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular