Bigg Boss Sohel Accident: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ప్రమాదానికి గురయ్యాడు. తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ కోసం విశాఖ సముద్రంలోకి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో అతడు బయటపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సోహైల్ సింగరేణి ముద్దుబిడ్డగా ఫేమస్ అయ్యాడు. తన గేమ్, మాట తీరుతో ఫ్యాన్స్ ని సంపాదించాడు. బిగ్ బాస్ రియాలిటీ షో సోహైల్ కి భారీ ఫేమ్ తెచ్చింది. ఫైనల్ కి చేరిన సోహైల్ రూ. 10 లక్షల సూట్ కేసు తీసుకొని రేసు నుండి వైదొలిగాడు. గెస్ట్ గా వచ్చిన చిరంజీవి అతనికి మరో రూ. 10 లక్షలు ప్రకటించారు.

అలాగే సోహైల్ మూవీ చేస్తే… అతని సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి సిద్ధం. తాను ఎప్పుడొచ్చి అడిగినా తన హామీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆ దెబ్బతో సోహైల్ జాతకం మారిపోయింది. ఒకటికి మూడు సినిమాలు సోహైల్ ప్రకటించారు. ఆయన హీరోగా లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
లక్కీ లక్ష్మణ్ ప్రమోషన్స్ లో భాగంగా సోహైల్ వైజాగ్ వెళ్ళాడు. అక్కడ మత్యకారుడు లోకల్ బాయ్ నానిని కలిశారు. యూట్యూబర్ అయిన లోకల్ బాయ్ నాని సముద్రంలో చేపలు పట్టే వీడియోలు షేర్ చేస్తాడు. అతని ఛానల్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నానితో తన లక్కీ లక్ష్మణ్ మూవీ ప్రమోషన్స్ చేయాలని సోహైల్ భావించాడు. సోహైల్ బోటులో సముద్రంలోకి వెళ్ళాడు. వల ఎలా విసరాలి, చేపలు ఎలా పట్టాలి? వంటి విషయాలు అడిగి తెలుసుకున్నాడు.

బోటు అంచున నిల్చొని ఫోటోలు దిగే క్రమంలో సోహాల్ ప్రమాదవశాత్తు జారీ సముద్రంలో పడ్డాడు. భయంతో సోహైల్ హాహాకారాలు చేశాడు. లోకల్ బాయ్ నాని సోహైల్ ని రక్షించాడు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సోహైల్ సురక్షితంగా బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన కాలికి మాత్రం చిన్న గాయమైనట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా ప్రమోషనల్ స్టంట్ కూడా కావచ్చని కొందరి ఆలోచన. ఈ మధ్య చిన్న చిత్రాల హీరోలు ఇలాంటి సెన్సేషన్స్ ప్రమోషన్స్ కోసం ఎంచుకుంటున్నారు. సోహైల్ కి ప్రమాదం అంటే ఆటోమేటిక్ మీడియా ఆ న్యూస్ కవర్ చేస్తారు. సినిమాకు ప్రచారం దక్కుతుంది.