
Mohan Babu- Bhuma Mounika Reddy: మంచు మనోజ్-భూమా మౌనిక ఒక ఇంటివారయ్యారు. వారు పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీ రాత్రి 8:30 నిమిషాలకు మౌనిక మెడలో మనోజ్ తాళి కట్టారు. ఈ వివాహానికి బంధు మిత్రులతో పాటు కొందరు సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా ఉండి ఈ తంతు నిర్వహించింది. గత నాలుగు రోజులుగా మంచు లక్ష్మి నివాసంలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. మహా మంత్ర యాగం కూడా చేయించారట.
Also Read: Jessie: వాడు పిచ్చోడు కాదు ఫేక్ అనిపిస్తే వదిలేస్తాడు… సిరి,షణ్ముఖ్ లపై జెస్సీ షాకింగ్ కామెంట్స్
మంచు మనోజ్ పెళ్లి వేడుకలు మొదలైనప్పటికీ మోహన్ బాబు స్పందించలేదు. కూతురు మంచు లక్ష్మి ఇంట్లో ఆయన కాలు పెట్టలేదు. కనీసం సోషల్ మీడియాలో స్పందించలేదు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న పుకార్లకు బలం చేకూరింది. పెళ్ళై కొడుకున్న మౌనికను కోడలిగా మోహన్ బాబు అంగీకరించడం లేదట. మౌనికతో పెళ్లి వద్దని మనోజ్ కి గట్టిగా చెప్పాడట. అయినా మంచు మనోజ్ వినకుండా మౌనికతో పెళ్లికి సిద్దమయ్యారట. ఈ విషయంలో తండ్రితో గొడవపడి మనోజ్ ఇంటి నుండి వెళ్లిపోయాడనే ప్రచారం జరిగింది.
అసలు మోహన్ బాబు పెళ్ళికి వస్తారా లేదా? అనే సందేహాలు కొనసాగుతుండగా ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు అతిథిలా మోహన్ బాబు వచ్చారు. ఆయన అయిష్టంగానే ఈ వేడుకకు హాజరయ్యారనే మరో వాదన తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా పెళ్ళికి వచ్చి మోహన్ బాబు పెద్దరికం నిలబెట్టుకున్నారు.నలుగురిలో అబాసుపాలు కాకుండా చూసుకున్నారు. కాగా పెళ్లి వేదికపై మామయ్య మోహన్ బాబును చూసి మౌనిక ఎమోషనల్ అయ్యారట. ఆశీర్వాదం తీసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారట.

మౌనిక అంతగా ఎమోషనల్ కావడానికి కారణం… అప్పటి వరకూ జరిగిన మానసిక సంఘర్షణ కావచ్చు. తన వలన మంచు ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకోవడం. ఎన్ని జరిగినా చివరికి మోహన్ బాబు తమ పెళ్ళికి వచ్చి ఆశీర్వదించడం ద్వారా ఆయన తనను అంగీకరించినట్లు మౌనిక భావించి ఉండొచ్చు. పైగా మౌనికకు తల్లిదండ్రులు లేరు. అయితే మంచు విష్ణు ఈ వివాహానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. అభిమానులు మంచు మనోజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనోజ్-మౌనికలకు ఏళ్ల క్రితమే పరిచయం ఉంది. మంచు ఫ్యామిలీతో భూమా ఫ్యామిలీకి ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణం అనంతరం కొంచెం బంధాలు పలుచబడ్డాయని సమాచారం.