Mobile Phones In Bathroom
Mobile Phones In Bathroom: నేటి డిజిటల్ యుగంలో, బాత్రూమ్‌తోసహా ప్రతిచోటకు మన వెంట మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లడం సాధారణంగా మారింది. ఆన్‌లైన్ అప్‌డేట్ మిస్ కాకుండా కనెక్ట్ అయి ఉండడం ఈ అలవాటుకు కారణమవుతోంది. అయితే ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్‌సేథీ. టాయిలెట్‌లో మీ ఫోన్‌ని ఉపయోగించడం వల్ల అనుకోని అనారోగ్య పరిణామాలు ఎదురవుతాయని పేర్కొన్నారు. మీ ఫోన్‌ను బాత్రూంలోకి తీసుకెళ్లే అలవాటు వలన మీకు తెలియకుండానే టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతారని.. ఈ అలవాటుని మానుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సమస్యలు..
– టాయిలెట్‌లోకి మొబైల్ ఫోన్ తీసుకోవడం వలన హేమోరాయిడ్స్, మల సమస్యలు ఇతర జీర్ణశయాంతర సమస్యలకు దారితీయవచ్చు.
– మొబైల్ పరికరాలను టాయిలెట్‌కు తీసుకువెళ్లడం వల్ల మల ప్రాంతంలో రక్తనాళాలు వాపొస్తాయి. దీంతో పైల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
– ఫోన్‌లో నిమగ్నమై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇప్పటికే ఉన్న జీర్ణశయాంతర సమస్యలను మరింత తీవ్రతరం కావచ్చు.
– ఆరోగ్య సమస్యలతోపాటు, మీ ఫోన్ బాత్రూంలోకి తీసుకెళ్లడం వల్ల పరిశుభ్రత సమస్యలు కూడా తలెత్తుతాయని డాక్టర్ సేథి హైలైట్ చేశారు.
– ఫోన్ల ఉపరితలంపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. వ్యక్తులు బాత్రూమ్ నుంచి బయటకి వస్తూ ఆ బాక్టీరియాను తమతో క్యారీ చేస్తారు. కొన్ని అధ్యయనాలు టాయిలెట్ సీట్ల కంటే ఫోన్ స్క్రీన్‌లపైనే ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉన్నాయని తేలింది.
– ఈ ఫోన్‌లపై ఈ కొలై, సాల్మొనెల్లా వంటి జెర్మ్ ్స ఉండే అవకాశం ఉంది. మూత్ర మార్గము అంటువ్యాధులు, డయేరియా, వివిధ ప్రేగు సంబంధిత అంటువ్యాధులు వంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం మరింత పెరుగుతుంది.
– టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల మల విసర్జన సమస్యలు తలెత్తుతాయని, మలబద్దకానికి దోహదపడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ సమస్యలను నివారించడానికి టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.