Crooked Forest : సాధారణంగా మనం ఏ చెట్టును చూసినా.. మొక్కను నాటినా.. నిటారుగా పెరుగుతాయి. కొబ్బరి, తాటి, బొప్పాయి జాతి మొక్కలు అయితే ఎలాంటి శాకలు లేకుండా ఉంటాయి.. ఇక ఇతర మొక్కలు అయితే కొమ్మలు విస్తరిస్తూ.. నిటారుగా పెరిగి… విస్తరిస్తాయి. కొన్ని వంకరగా కూడా ఉంటాయి. మరికొన్ని ప్రకృతి వైపరిత్యాలు, మరేదైనా కారణం చేతనో వంకరగా ఉండటం సహజం. కానీ ఆ అడవిలో ఎవరో దగ్గరుండి పనిగట్టుకుని పెంచినట్లుగా అన్ని ఒకే వంకరల్లో చెట్లు ఉంటాయి. విచిత్రం ఏమిటంటే అలా వంపు తిరిగి ఉన్నవన్నీ ఒకే జాతి మొక్కలు. మరి ఈ అడవి ఎక్కడ ఉంది.. ఎందకిలా జరిగింది చెట్టు వంకర్లు తిరుగతాయి.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం.
పోలండ్‌లో చిట్టడి..
వయ్యారాలకు పోతూ వంకర తిరిగిన చెట్లు ఉన్న చిట్టడవి పోలండ్‌లోని వెస్ట్ పోమెరేనియాలోని గ్రిఫినో అనే పట్టణానికి సమీపంలో ఉంది. దీన్ని ’వంకర అడవి’ లేదా క్రూక్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ చెట్టు బేస్ వద్ద వంపు తిరిగి ఉండి.. అసాధారణమైన అడవిలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ పైన్ చెట్లే. పైగా చెట్లన్ని కూడా సుమారు 90 డిగ్రీ బేస్ వంపు తిరిగి ఉన్నాయి. సుమారు రెండు హెక్టార్ల భూమిలో వందకు పైగా ఉన్న ఈ పైన్ చెట్లన్నీ ఇలానే వంకరగా ఉన్నాయి. చూడటానికి ఆంగ్ల అక్షరం ’ఒ’ ఆకారంలో ఉన్నాయి చెట్లు. ఆ చెట్లన్నీ ఉత్తరం వైపే తిరిగి ఉంటాయి. ఇవి వంకరగా ఉన్నప్పటికీ వాటి వంపుతో సంబంధం లేకుండా సుమారు 50 అడుగులు ఎత్తు వరకు ఎదగుతుండడం విశేషం.
సంపూర్ణ ఆరోగ్యంగా..
ఈ పైన్ చెట్లకు ఎలాంటి చీడపీడల లేవు. పైగా ఆరోగ్యంగా ఉన్నాయి. పైన్ చెట్లు ఎందుకిలా వంపు తిరిగి ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో భాగంగా ఆ చెట్ల వయసును లెక్కిస్తే.. దాదాపు 1930లలో నాటిన చెట్లుగా తేలింది. ఇక్కడ చెట్లు వంపు తిరిగి ఉండటానికి మంచు తుపానులు, లేక గురత్వాకర్షణ శక్తి లేదా జన్యు పరివర్తన అని పరివిధాలుగా పరిశోధనలు చేసినా.. ఓ పట్టాన శాస్త్రవేత్తలు అసలు కారణం ఏమిటో చెప్పలేకపోయారు. గ్రహాంతరవాసులు పని అని కొందరూ భావిస్తున్నారు.

రైతులే కారణమా..
ఈ ఫైన్ చెట్లు ఇలా అసాధారణ రీతిలో ఉండటానకి స్థానికి రైతులే కారణం అని అంటున్నారు పలువురు. ఫర్నీచర్ కోసం ఇలా వంగిన చెట్లను ఉద్దేశపూర్వకంగానే పెంచుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఈ అడివిలో దాదాపు 400 పైన్ చెట్లు ఉన్నాయని అవే అలా వంకర ఉన్నాయని పలు వాదనలు వినిపిస్తున్నాయి.
– 1970లో రెండోవ ప్రపంచ యుద్ధంలో ఆ అడవిని అలా వదిలేయడంతో ఇలా చెట్లు వంపు తిరిగి ఉన్నాయని కొందరూ చెబుతున్నారు. యుద్ధానికి ముందు ఉన్న స్థానికులకే ఈ అసాధారణ అడవికి సంబంధించిన రహస్యం తెలిసి ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఆ అడవి అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది.