CPI Narayana- NTR: జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షాను ఏ నిమిషాన భేటీ అయ్యాడో గానీ, రాజకీయ అలజడి ఇంకా రగులుతూనే ఉంది. ఎన్టీఆర్ పై బీజేపీ కన్ను పడిందనే టాక్ మరోవైపు, చంద్రబాబుకి చెక్ పెట్టేందుకే ఎన్టీఆర్ ను వదులుతున్నారనే టాక్ మరోవైపు.. ఎవరి టాక్ ఎలా ఉన్నా.. ఈ భేటీ పై మాత్రం రోజుకొక నాయకుడు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా సీపీఐ నారాయణ కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘ఏమయ్యా జూనియర్ ఎన్టీఆర్ నీకు ఏం ఖర్మ పట్టిందని ఆ అమిత్ షాను కలిశావు ?, నువ్వు గొప్ప నటుడివి. నీకు ఎందుకు ఇంత గతి పట్టింది?, అసలు ఆ బీజేపీనే సినిమా యాక్టర్ల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సినిమా నటులు జాగ్రతగా ఉండాలి. ఎన్టీఆర్ కూడా ఆలోచించుకుంటే మంచిది. జూనియర్ ఎన్టీఆర్ తాత, తండ్రి మంచివారు. మరీ అతనికేం అయింది ?, ఎందుకు అమిత్ షాను కలిశాడు ? అంటూ ప్రశ్నించాడు నారాయణ.
పైగా మరో ఘాటైన వ్యాఖ్య కూడా చేశాడు. ఎన్టీఆర్ క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరకు ఎందుకు వెళ్లాలి ?, వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ గుజరాత్ వాళ్లు మన దేశాన్ని దోచేస్తున్నారు, వారిని మనం తరిమి కొట్టాలి, లేకపోతే మనల్ని తినేస్తారు ? అంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, ఈ విమర్శలు వెనుక చంద్రబాబు ఉన్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరోసారి నారాయణ గారు దయచేసి ఇలా మాట్లాడకండి. మాట్లాడితే.. మిమ్మల్ని కిందపడేసి తొక్కి పాడేస్తాం’ అంటూ తారక్ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఎన్టీఆర్ ఏమీ షాను కలవడానికి ఆసక్తి చూపించలేదు. షానే తారక్ ను కలవాలని కబురు పెట్టాడు. దాంతో షా ఆహ్వానం మేరకు తారక్ భేటీ అయ్యాడు. అయితే, అప్పటి నుంచి ఈ భేటీ పై సర్వత్రా అనుమానం కలుగుతూనే ఉంది. వాస్తవానికి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అందుకే, బీజేపీ పెద్దలు ఎన్టీఆర్ పై గురి పెట్టారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరోపక్క బీజేపీ నేతలు, అభిమానులు ఎన్టీఆర్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నారు. ఇది భారత రాజకీయాల్లో కొత్త శకమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మొత్తమ్మీద రానున్న ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాగూ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి, అమిత్ షా దేశవ్యాప్తంగా అతనితో ప్రచారం చేయించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సౌత్ లో. ఎన్టీఆర్ కన్నడలో, తమిళంలో అలాగే మలయాళంలో కూడా స్పష్టంగా మాట్లాడగలడు.
పైగా కర్ణాటకలో ఎన్టీఆర్ ను ఓన్ చేసుకుంటారు. అందుకే, బిజేపి ఎన్టీఆర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి ఇది నిజమే అయితే, ఇక ఎన్టీఆర్ ను మరోసారి రాజకీయ తెర పై చూసే అవకాశం ఉంది. అయితే, షా ఎన్టీఆర్ ను కలవడానికి మరో కారణం కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందట. ఇందులో భాగంగానే.. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ను భేటీ అయ్యారని తెలుస్తోంది. ఏది ఏమైనా అమిత్ షాను ఎన్టీఆర్ కలవడం మిగిలిన పార్టీల నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ