https://oktelugu.com/

Pre-Wedding Shoot : పాముతో ఫోటోషూట్ ప్రీ వెడ్డింగ్ లోనే పోతారురోయ్..!!

తాజాగా ఓ జంట ఏకంగా పాముతో ఫొటో షూట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వివేక్‌ అనే యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2023 / 04:33 PM IST
    Follow us on

    Pre-Wedding Shoot : రగులుతోంది  మొగలి పొద.. బుస్‌.. బుస్‌.. ఒగలమారి కన్నె ఎద.. బుస్‌.. బుస్‌.. ఈ పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఖైదీ సినిమాలో చిరంజీవి, మాధవిపై తీసిన ఈ పాట ఎవర్‌ గ్రీన్‌.. మొగలి పొదలు పాముల సయ్యాడ సందర్భంగా చిత్రీకరించిన విరహం పాట. తాజాగా ఓ జంట కూడా ఇలాగే ట్రై చేసింది. ప్రీవెడ్డింగ్‌ షూట్‌ను పాముతో కలిసి తీసుకుంది. సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

    ఇటీవల కాలంలో ఫొటో షూట్‌ల హడావిడీ ఎక్కువైపోయింది. ప్రతీ ప్రత్యేక సందర్భాన్ని జీవితాంతం గుర్తుండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. పెళ్లికి అయితే ఫొటో షూట్‌ తప్పనిసరిగా మారింది. ప్రీ వెడ్డింగ్‌ షూట్లకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్‌ షూట్‌ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మరీ చిత్ర విచిత్ర లోకేషన్లలో వస్తువులతో ఫొటోషూట్‌లు చేస్తున్నారు.

    పాముతో ప్రీవెడ్డింగ్‌..
    తాజాగా ఓ జంట ఏకంగా పాముతో ఫొటో షూట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వివేక్‌ అనే యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఓ జంటను పాము ఎలా కలిపిందనే విషయాన్ని ఈ ఫొటోలు వెల్లడిస్తాయి. ఇందులో యువతి ఇంటి దగ్గర నడుచుకుంటూ వస్తుండగా ఆమెకు పాము ఎదురైంది. దీంతో పామును చూసి భయపడి రెస్క్యూ సర్వీసులకు కాల్‌ చేసి పిలిపించింది. ఇంతలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి రాగా.. ఓ వ్యక్తి మహిళవైపు చూసి నవ్వడం కనిపిస్తుంది. ఆపై వారు పాముని పట్టుకుని బాక్స్‌ లోపల పెడతారు. తర్వాత పామును తీసుకుని వెళుతూ తనకు కాల్‌ చేయాలని ఆ వ్యక్తి మహిళకు సంకేతం ఇస్తాడు. ఆపై వారు ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమలో పడిపోతారు. చివరి ఫొటోలో పాము ఇద్దరిని ఒక్కటి చేసినట్లు చూపించారు.

    నెట్టింట వైరల్‌..
    అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్పందన లభించింది. షార్ట్‌ మూవీస్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ చేయాలని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా మరొవ్యక్తి ట్విటర్‌లో తాను చూసిన బెస్ట్‌ ఫొటోలు అని ట్వీట్‌ చేశాడు. ఇక ఆస్కార్‌ పెర్షార్మెన్స్‌ అంటూ కొంతమంది.. పెద్ద లవ్‌ స్టోరీని చిన్న పాముల పెట్టుతో చూపించారు అంటూ ఇంకొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్లు… పాముతో ఈ జంట చేసిన ప్రీవెడ్డింగ్‌ షూట్‌ మాత్రం వైరల్‌గా మారింది.