https://oktelugu.com/

‘చికెన్’లో కరోనా.. బయటపడ్డ షాకింగ్ నిజం.. ఎక్కడంటే?

  దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దక్షిణ చైనాలోని షెంజన్ ప్రభుత్వం బ్రెజిల్ నుంచి దిగుమతి చేసిన చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించామని తెలిపింది. సాధారణ చెకప్ లో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో చనిపోయిన కోడికి కరోనా నిర్ధారణ అయిందని తేలింది. గత సంవత్సరం డిసెంబర్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 13, 2020 4:48 pm
Follow us on

 

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దక్షిణ చైనాలోని షెంజన్ ప్రభుత్వం బ్రెజిల్ నుంచి దిగుమతి చేసిన చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించామని తెలిపింది. సాధారణ చెకప్ లో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో చనిపోయిన కోడికి కరోనా నిర్ధారణ అయిందని తేలింది.

గత సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలో కరోనా వైరస్ విజృంభించగా అధికారులు షింఫడీ సీపుడ్ మార్కెట్లో కరోనా ఆనవాళ్లు కనిపించడంతో ఈ మార్కెట్ పై దృష్టి పెట్టారు. అప్పటినుంచి లోకల్ గా ఉండే వైద్యులు తరచుగా వ్యాపారులు, వినియోగదారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి వైరస్ సోకిందో లేదో నిర్ధారిస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న కోడి రెక్కల్లో వైరస్ నిర్ధారణ అయింది.

అధికారులు తక్షణమే మాంసం కొనుగోలు చేసిన వారందరికీ ముందస్తు చర్యల్లో భాగంగా పరీక్షలు చేయగా నెగిటివ్ నిర్ధారణ అయింది. చైనాలొని బ్రెజిల్ ఎంబసీ ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. డ్రాగన్ మరో ప్రకటనలో ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న సీ ఫుడ్ ప్యాకేజీల్లో కరోనా వైరస్ ను నిర్ధారించినట్లు తెలిపింది. మరోవైపు కోడి రెక్కల్లో వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.