Homeట్రెండింగ్ న్యూస్San Jose Warship : సముద్ర గర్భంలో భారీ నిధి వెలుగులోకి... లక్ష కోట్లు విలువ...

San Jose Warship : సముద్ర గర్భంలో భారీ నిధి వెలుగులోకి… లక్ష కోట్లు విలువ చేసే బంగారం ఎలా వచ్చిందో తెలుసా?

San Jose Warship : అదో విశాల సముద్రం… లోపల ఎటు చూసినా బంగారమే.. విచ్చలవిడిగా విసిరేసినట్టు ఉన్న ఆ సీన్‌ చూసి జనాలకు మెంటల్‌ వచ్చేసింది. కళ్లు చెదిరిపోయే బంగారు నాణేల సంపద ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఈ బంగారాన్ని ఇటీవలే అధికారులు గుర్తించారు. దాదాపు 200 ఏళ్ల క్రితం మునిగిపోయిన రెండు నౌకల శిధిలాల కింద గుట్టలకొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు సమాచారం. వాటి విలువ 17 బిలియన్‌ డాలర్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎలా వచ్చిందంటే.. 
1708లో స్పానిష్‌ యుద్ధం జరిగింది. యుద్ధంలో బ్రిటీష్‌ నౌకలు జరిపిన దాడిలో సాన్‌ జోస్‌ నౌక నీటి మునిగింది. ఆ నౌకలో సుమారు 600 మంది ఉన్నారు. వారితోపాటు బంగారు నాణేలు, ఆభరణాలు, ఇంకా బంగారు సామగ్రి ఉన్నాయి. యుద్ధం సమయంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఈ నౌక నీటమునిగింది.
రిమోట్‌ వాహనంతో గుర్తింపు.. 
2015లో స్పానిష్‌ ప్రభుత్వం ఓడ నాశనానికి సంబంధించిన ఓ ఫుటేజీని కొలంబియా అధికారులు విడుదల చేశారు. ఇందులో చెల్లాచెదురుగా విలువైన వస్తువులు ఉన్నాయి. వీడియో రిమోట్‌ కంట్రోల్డ్‌ వాహనం ద్వారా పరిశీలించగా ప్రధాన ఓడ శిథిలాల పక్కనే ఒక పడవ ఉంది. ఈ రెండు నౌకలు 200 ఏళ్ల నాటివని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన నివేదికలో పేర్కొంది. రిమోట్‌తో నడిచే వాహనాన్ని కరేబియన్‌ తీరానికి 3,100 అడుగుల లోతుకు పంపినట్లు తెలిపింది.
నీలం, ఆకుపచ్చ చిత్రాలు.. 
రిమోట్‌ యంత్రం తీసిన ఫుటేజీలు నీలం, ఆకుపచ్చ రంగులలో ఉన్నాయి. సముద్రపు అడుగుభాగంలో చెల్లాచెదురుగా ఉన్న బంగారు నాణేలు, కుండలు, చెక్కుచెదరకుండా ఉన్న పింగాణీ కప్పులను కూడా అధికారులు గుర్తించారు. వివిధ రకాల మట్టి కుండలతోపాటు సముద్రగర్భంలో ఫిరంగి కూడా ఉన్నట్లు గుర్తించారు. నావికాదళం, ప్రభుత్వానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు శాసనాల ఆధారంగా వాటి మూలాన్ని గుర్తించేందుకు కృషి చేస్తున్నామని కొలంబియా అధికారులు తెలిపారు. వాటిని వెలికి తీశాక శాన్‌ జోస్‌ గ్యాలియన్‌ వారసత్వ సంపదగా రక్షిస్తామని ప్రెసిడెంట్‌ ఇవాన్‌ తెలిపారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular