Viral Video : 2024 లోనే కాదు 2025 లోనూ పెద్దపెద్ద కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులనైతే ఇతర దేశాలకు బదిలీ చేయడానికి కూడా వెనుకాడటం లేదు.. ఇక ఉన్నవారితో తీవ్రంగా శ్రమ చేయిస్తున్నాయి. వేరే ఉద్యోగం చేసే సామర్థ్యం లేకపోవడం.. ప్రభుత్వ నోటిఫికేషన్లు అంత త్వరగా రాకపోవడంతో చాలామంది అందులోనే పనిచేస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టుగా తమ నైపుణ్యాన్ని పెంచుకున్న వారు మాత్రం భారీగా సంపాదిస్తున్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటివి దూసుకొస్తున్నప్పటికీ.. తమ ఉద్యోగానికి డోకా లేకుండా చూసుకుంటున్నారు. వీరిలో కొంతమంది వర్క్ ఫ్రం హోం చేస్తూనే భారీగా సంపాదిస్తున్నారు. సంవత్సరానికి కోటికి పైగా వెనకేసుకుంటున్నారు. అయితే ఇటువంటి ఓ ఐటీ ఉద్యోగి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు తారసపడ్డారు. దీంతో అక్కడ జరిగిన చర్చ సంచలనంగా మారింది.
చంద్రబాబు షాక్
చంద్రబాబు నాయుడు శనివారం రాయచోటిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ఐటీ ఉద్యోగులతో కలిసి భేటీ నిర్వహించారు.. ఐటీ ఉద్యోగులు సమాజ సేవలో భాగం కావాలని.. సొంత రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఐటి ఉద్యోగులతో చంద్రబాబు నాయుడు భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు నిర్వహించిన భేటీలో ఐటీ ఉద్యోగులు తమ మనోగతాలను వెల్లడించారు. అందులో యువరాజ్ అనే వ్యక్తి తన మనోగతాన్ని వెల్లడించాడు..” నా పేరు యువరాజ్ యాదవ్. నేను బెంగళూరులో ఐడి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం ఇంటివద్ద నుంచే పని చేస్తున్నాను. నెలకు అన్ని కటింగ్స్ పోనూ నాకు 6.37 లక్షల వేతనం వస్తుంది. మొత్తంగా చేయడానికి 93 లక్షలు సంపాదిస్తాను.. ఐటి ఉద్యోగం వల్ల నేను సంతృప్తి గానే ఉన్నాను. ఒకప్పుడు డబ్బుల కోసం చాలా కష్టపడ్డాను. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. చివరికి ఐటి ఉద్యోగిగా స్థిరపడ్డాను. ఇంటిదగ్గర నుంచి పనిచేస్తున్నాను. ఒక ఇల్లు కట్టుకున్నాను. కొంతమేర ఆస్తులు కూడా కూడబెట్టుకున్నాను.. ఐటి ఉద్యోగిగా పనిచేయడం గర్వంగా ఉంది. ప్రస్తుతం నేను పనిచేయడం వల్ల నా కుటుంబం కూడా బాగుంది. ఐటీ అనేది నిరంతర ప్రవాహం.. అందులో పట్టు సాధిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. మనలో నైపుణ్యానికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఉండాలి. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. వాటి ఆధారంగానే మన ఉద్యోగం ఆధారపడి ఉంటుందని” యువరాజ్ వ్యాఖ్యానించాడు. ఏడాదికి 93 లక్షలు సంపాదిస్తాను అని చెప్పగానే.. చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు.. ఇంటి దగ్గరుండి ఏడాదికి 93 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని చప్పట్లు కోట్టి అభినందించాలని.. ఆ భేటీకి హాజరైన వారందరినీ చంద్రబాబు కోరగా.. వారంతా చప్పట్లు కొట్టి యువరాజ్ ను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మరో వైపు యువరాజ్ మాట్లాడిన మాటలను వైసిపి నాయకులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. నెలకు
6.37 లక్షల వేతనం సంపాదించే వ్యక్తి.. ఏడాదికి 93 లక్షలు ఎలా ఆర్జిస్తాడని కాంమెట్స్ చేస్తున్నారు. ఇదంతా చంద్ర బాబు పీఆర్ మాయాజాలం అని విమర్శిస్తున్నారు.
93LPA
30% Tax — 27,90,000/-
Remaining— 65,10,000/-
65,10,000 / 12 months — 5,42,500/-
(But he’s getting 6,37,000/-) wowChepthe koncham nammettu undaali ra Child artist pic.twitter.com/aDaPdHqmda
— Mr.Hemant (@Hemant_PBYSJ) February 1, 2025
నిజమైన Fowerful బాబు శిష్యుడు- Fer month 6 lakhs అంట అధికూడ కటింగ్స్ పోగా pic.twitter.com/mmHhgGXcq7
— Satish Reddy (@ReddySatish_) February 1, 2025