
Manchu Manoj- Vishnu: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే.ఎంతో సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలం నుండి విభేదాలు ఏర్పడ్డాయని, మోహన్ బాబు మనోజ్ కి రావాల్సిన ఆస్తులను పనిచేసి ఇంట్లో నుండి బయటకి గెంటేసాడని, ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారమయ్యాయి.ఇదే విషయాన్నీ మంచు విష్ణు ని కమెడియన్ అలీ ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాం లో అడగగా ఆయన ‘అలాంటిది ఏమి లేదంటూ’ చెప్పుకొచ్చాడు.
కానీ ఆయన అలా చెప్పింది కేవలం మాటవరుసకి మాత్రమే అని రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే అర్థం అవుతుంది.రీసెంట్ గానే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.మంచు లక్ష్మి నివాసం లో చాలా పరిమితమైన బంధు మిత్రుల సమక్ష్యం లో ఈ వివాహం జరిగింది.
అయితే ఈ వివాహం అంటే మంచు కుటుంబం లో ఎవరికీ కూడా ఇష్టం లేదని, ముఖ్యంగా మంచు విష్ణు కి అతని భార్య విరినాక కి అసలు ససేమీరా ఇష్టం లేదని సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అయ్యింది.అందుకు కారణం భూమా మౌనిక అంటే వాళ్ళెవ్వరికి అసలు ఇష్టం లేదట.

YSR కి కుటుంబానికి చెందిన విరినాక కి మొదటి నుండి భూమా కుటుంబం అంటే ఇష్టం లేదని,వాళ్ళ మధ్య కుటుంబ పరంగా కూడా విభేదాలున్నాయని, అందుకే ఈ సంబంధం వద్దని ఎంత చెప్పినా కూడా మనోజ్ లెక్క చెయ్యకుండా ఆమెతో డేటింగ్ చెయ్యడం, వివాహం చేసుకోవడం వంటివి అసలు నచ్చలేదని, ఇక్కడి నుండే వీళ్ళ మధ్య విబేధాలు ఏర్పడ్డాయి అని ఫిలిం నగర్ లో ఒక టాక్ జోరుగా ప్రచారం సాగుతుంది.మొన్న పెళ్ళికి కూడా విష్ణు ఎదో బయటవాడిలాగానే అలా వచ్చి , ఒక పది నిమిషాలు పెళ్ళిలో ఉంది ఆ తర్వాత వెంటనే అక్కడి నుండి వెనుతిరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
