Vijaya Shanthi: లేడీ సూపర్ స్టార్ అనే పదానికి పర్యాయపదం లాంటి హీరోయిన్ సౌత్ లో ఎవరైనా ఉన్నారా అంటే అది ‘విజయ శాంతి’ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. హీరోయిన్ గా సౌత్ ఇండియాలో దాదాపుగా ప్రతీ సూపర్ స్టార్ కి జంటగా నటించిన ఈమె, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కూడా శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ఇండియన్ మహిళగా గుర్తింపు పొందారు. ఆరోజుల్లోనే ఫైట్స్ తో కూడిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి, ఆడవాళ్లు కూడా మగవాళ్ళకి సరిసమానంగా సినీ రంగంలో అన్ని విధాలుగా పోటీ అని చెప్పిన స్టార్ హీరోయిన్ ఆమె.. ఆ రోజుల్లో ఈమె చేసిన వందేమాతరం, ప్రతిఘటన, కర్తవ్యం మరియు ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలు సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.. ముఖ్యంగా ఒసేయ్ రాములమ్మ చిత్రం అయితే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మొట్టమొదటి , చివరి స్టార్ హీరోయిన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క విజయశాంతి మాత్రమే. అలాంటి లేడి సూపర్ స్టార్ బయోగ్రఫీ ని ఈరోజు మనం చూడబోతున్నాము.
-బాల్యం/ విద్యాబ్యాసం:
విజయ శాంతి 1966వ సంవత్సరం జూన్ 24వ తేదీన సత్తి శ్రీనివాస ప్రసాద్ -వరలక్ష్మి దంపతులకు చెన్నై లో జన్మించింది. ప్రముఖ నటి విజయలలితకి విజయ శాంతి మేనకోడలు అవుతుంది. ఈమె బాల్యం మొత్తం చెన్నైలోనే గడిచింది.. విద్యాబ్యాసం కూడా అక్కడే.. హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పదో తరగతి వరకు చదువుకుంది.. చదువు మొత్తం పూర్తి అయినా తర్వాత విజయ లలిత ప్రోత్సాహంతో కుటుంబం మొత్తం తెలంగాణ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యింది.
-కెరీర్ :
విజయ శాంతి తనకి 14 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టింది.. కల్లుకుల్ వీరం అనే చిత్రంలో ఒక చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు రోల్ ని వేసింది..ఆ తర్వాత భారతిరాజా దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరో గా నటించిన ‘ఖిలాడీ కృష్ణుడు’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా మన తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయ్యింది.. ఆ తర్వాత ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన సత్యం – శివమ్ మూవీలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది విజయ శాంతి.
అలా హీరోయిన్ గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని కొనసాగిస్తూ వచ్చిన విజయ శాంతి 1983వ సంవత్సరంలో పెళ్లి చూపులు అనే సినిమా ద్వారా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా అవతరించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో విజయ శాంతి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. ఇక ఆ తర్వాత 1983 వ సంవత్సరం లో వచ్చిన ‘నేటి భారతం’ అనే చిత్రం విజయ శాంతి కెరీర్ ని మలుపు తిప్పింది..కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు, నటిగా కూడా తన విశ్వరూపం చూపగలదు అని ఈ చిత్రం ద్వారా నిరూపించుకుంది విజయ శాంతి.. ఆమె నటన చూసిన ప్రతీఒక్కరు ఈమె భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. ఆ సినిమా తర్వాత వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ప్రతిఘటన’ అయితే అప్పటి స్టార్ హీరోల సినిమా రేంజ్ లో వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకి గాను నంది అవార్డు కూడా దక్కింది. అలా ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విజయశాంతి చిరంజీవి, బాలకృష్ణ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి హీరోలతో అత్యధిక సినిమాలు చేసింది. అప్పట్లో చిరంజీవితో ఈమె 19 సినిమాలు చెయ్యగా అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ , ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాలే అవ్వడం విశేషం. నందమూరి బాలకృష్ణతో కూడా ఈమె 17 సినిమాలు వరకు చేసింది. మరో విశేషం ఏమిటంటే ఆరోజుల్లో ఈమె బాలకృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉండేది.. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడించిందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.అప్పట్లో బాలయ్య బాబుని హీరో గా పెట్టి ‘నిప్పు రవ్వ’ అనే చిత్రం కూడా నిర్మించింది..ఈ సినిమా అప్పట్లో యావరేజిగా ఆడింది.
-నేషనల్ అవార్డు :
విజయశాంతి ప్రధాన పాత్రలో కిరణ్ బేడీ జీవిత చరిత్రని ఆధారంగా చేసుకొని మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కర్తవ్యం’ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో ఆమె నటనకి మెచ్చి భారత దేశ ప్రభుత్వం ఈమెకి నేషనల్ అవార్డుని ఇచ్చింది.. ఈ చిత్రం ద్వారానే మాస్ మహారాజ రవితేజ మొట్టమొదటిసారి వెండితెరపై మెరిశాడు.. కేవలం 90 లక్షల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే 7 కోట్ల రూపాయిలను వసూలు చేసింది.. ఈ చిత్రం అప్పట్లో 14 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కూడా అయ్యింది.
-డూపులు లేకుండా ఫైట్స్ :
ఆడవాళ్లు సినిమాల్లో ఫైట్స్ చేయడమే విచిత్రంగా చూసే ప్రేక్షకులు ఉన్న ఆరోజుల్లో విజయశాంతి డూపు లేకుండా రిస్కీ స్తంట్స్ చేసేది.. ఆ పోరాట సన్నివేశాలు చూస్తే ఎలాంటి వాడికైనా రోమాలు నిక్కపొడవాల్సిందే.. కర్తవ్యం సినిమా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఆమెకి హీరో పక్క హీరోయిన్ రోల్స్ కంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించే అవకాశం దక్కింది.. కెరీర్ ప్రారంభం లో కేవలం 5 వేల రూపాయిలు రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకునే విజయ శాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కోటి రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది.. అప్పటి స్టార్ హీరోలు సైతం ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు, ఒక్క మెగాస్టార్ చిరంజీవి తప్ప.
-ఏఎం రత్నంని నిర్మాతగా నిలబెట్టిన విజయ శాంతి:
మరో విశేషం ఏమిటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ఏఎం రత్నం గారు కెరీర్ ప్రారంభం లో విజయశాంతికి మేకప్ మ్యాన్ గా పని చేసేవాడట. ఆ తర్వాత ఆమెతోనే కర్తవ్యం వంటి చిత్రాన్ని నిర్మించాడు.. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
-రాజకీయ కెరీర్ :
సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా విజయ శాంతి గొప్పగా రాణించింది..1998వ సంవత్సరంలో బీజేపీ పార్టీలో చేరిన విజయ శాంతి కడప నుండి సోనియా గాంధీ మీద పోటీ చేయడానికి నామినేషన్ వేసింది.విజయ శాంతి కి ఉన్న క్రేజ్ వల్ల కచ్చితంగా ఓడిపోతామని కాంగ్రెస్ అధిష్టానం నుండి సర్వే రిపోర్టు రావడంతో సోనియా గాంధీ బళ్ళారికి షిఫ్ట్ అయ్యింది.. ఇక ఆ తర్వాత విజయశాంతి కూడా తన నామినేషన్ ని వెనక్కి తీసుకుంది.. 2009వ సంవత్సరంలో ఈమె ‘తల్లి తెలంగాణ’ అనే పార్టీ ని స్థాపించింది.. కానీ ఆదరణ దక్కకపోవడంతో ఆ పార్టీని TRSలో విలీనం చేసింది..ఆ సంవత్సరం ఈమె ఆ పార్టీ నుండి మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది..ఆ తర్వాత మెదక్ నుండి 2014 ఎన్నికలలో అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది.. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ లో చేరి రాజకీయాలను కొనసాగిస్తూనే ఉంది.
ఇలా సినీ కెరీర్ లో పతాకస్థాయికి చేరిన విజయశాంతి.. ప్రస్తుతం రాజకీయంగా అడుగులు వేస్తోంది. ఆమె ఇందులోనూ విజయం సాధించాలని ఆశిద్ధాం
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Cine celebrity biography vijayashanthi was the first heroine to receive crore remuneration
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com