https://oktelugu.com/

Suhas: సినీ సెలబ్రిటీ బయోగ్రఫీ : ఈ సైకో విలన్ రియల్ లైఫ్ లో పెద్ద లవర్ బాయ్… సుహాస్ గురించి మీకు తెలియని నిజాలు!

Suhas: చిన్న చిన్న పాత్రలతో ప్రత్యేకత చాటుకొని హీరో స్థాయికి వెళ్ళాడు సుహాస్. ఈ విజయవాడ కుర్రాడు పరిశ్రమలో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. అవకాశాలు రావు మనం అందిపుచ్చుకోవాలి. మన నటనతో మేకర్స్ ని ఆకర్షించాలని తెలిసిన నటుడు. అలాగే పట్టుదలతో ముందుకు వెళితే అసాధ్యం సాధ్యమవుతుందని నిరూపించిన మొండివాడు. ఒక యూట్యూబర్ హీరో కావడం చిన్న విషయం కాదు. కలర్ ఫొటో చిత్రంలో అమాయకపు ప్రేమికుడిగా చేసిన సుహాస్… ఫ్యామిలీ డ్రామా, హిట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 31, 2023 / 04:47 PM IST
    Follow us on

    Suhas: చిన్న చిన్న పాత్రలతో ప్రత్యేకత చాటుకొని హీరో స్థాయికి వెళ్ళాడు సుహాస్. ఈ విజయవాడ కుర్రాడు పరిశ్రమలో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. అవకాశాలు రావు మనం అందిపుచ్చుకోవాలి. మన నటనతో మేకర్స్ ని ఆకర్షించాలని తెలిసిన నటుడు. అలాగే పట్టుదలతో ముందుకు వెళితే అసాధ్యం సాధ్యమవుతుందని నిరూపించిన మొండివాడు. ఒక యూట్యూబర్ హీరో కావడం చిన్న విషయం కాదు. కలర్ ఫొటో చిత్రంలో అమాయకపు ప్రేమికుడిగా చేసిన సుహాస్… ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో సైకో కిల్లర్ గా విలనిజంలో పీక్స్ పరిచయం చేశాడు. విలక్షణ పాత్రలతో సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్న సుహాస్ రియల్ లైఫ్ లో రొమాంటిక్ ఫెలో…

    Suhas

    బాల్యం-విద్యాభ్యాసం
    సుహాస్ పుట్టి పెరిగింది విజయవాడ. స్థానిక కేబిఆర్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసేశాడు. చదువుకునే రోజుల్లోనే నటుడు కావాలనే కోరిక గట్టిగా ఉండేది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. చదువు పూర్తి కాగానే ఆలస్యం చేయకుండా తన కలల సినిమా పరిశ్రమ వైపు అడుగులేశాడు. హైదరాబాద్ వచ్చి నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మనమేంటో నిరూపించుకుంటే ఆఫర్స్ అవే వస్తాయని నమ్మి యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. అలా మేకర్స్ కంట్లో పడ్డాడు.

    నాగ చైతన్య హీరోగా 2015లో విడుదలైన ‘దోచేయ్’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాడు. చెప్పుకోదగ్గ పాత్ర లభించింది మాత్రం ‘పడి పడి లేచె మనసు’ చిత్రంతో. మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ తెచ్చాయి. స్నేహితుడైన డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాలో హీరోగా ఆఫర్ ఇచ్చారు. ఆహాలో విడుదలైన కలర్ ఫోటో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. పరిశ్రమలో నిలదొక్కుకున్న సుహాన్ విలన్, హీరో, కమెడియన్ పలు భిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

    Suhas

    ప్రేమ-పెళ్లి
    సుహాస్ రియల్ లైఫ్ లో రొమాంటిక్ ఫెలో. సినిమాటిక్ స్టైల్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లలిత అనే అమ్మాయిని ప్రేమించిన సుహాస్ పెద్దలకు తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. 2017లో లలిత-సుహాస్ ల వివాహం జరిగింది. అప్పటికి సుహాస్ నటుడిగా నిలదొక్కుకోలేదు. ఆమె నా జీవితంలోకి వచ్చాక దశ తిరిగిందని సుహాస్ అంటాడు. ఫ్యామిలీ డ్రామా మూవీ చూసి భయపడిన లలిత మూడు రోజుల వరకు ఇంటికి రావద్దని చెప్పిందట.

    Tags