Ram Charan- Allu Arjun: ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలు కలిసి చేసుకోవడం మెగా ఫ్యామిలీలో ఒక ఆనవాయితీగా ఉంది.సాధారణంగా చిరంజీవి నివాసంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. అక్కడ సెకండ్ జనరేషన్ మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతారు. ఈసారి రామ్ చరణ్ ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రిస్మస్ వేడుకలకు అల్లు అర్జున్ హాజరు కావడం విశేషం. సతీసమేతంగా అల్లు అర్జున్ చరణ్ హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు.
ఇక మెగా ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్రేమ్ లో ముచ్చటగా ఉన్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మెగా హీరోల క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. చరణ్ హోస్ట్ చేసిన క్రిస్మస్ వేడుకలకు అల్లు అర్జున్ హాజరుకావడంతో పుకార్లకు తెరపడింది. చిరంజీవి-అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తాయని కొన్నాళ్లుగా ప్రచారం అవుతుంది. సపరేట్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్… కావాలనే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది.
అల్లు అరవింద్ దీనిపై స్పందించారు కూడాను. ఇవన్నీ పనిలేని వాళ్ళు పుట్టించే పుకార్లు మాత్రమే. మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు లేవు, ఎప్పటికీ రావు. సందర్భం వచ్చినప్పుడు అందరం కలిసి జరుపుకుంటారు. షూటింగ్స్ కారణంగా అందరూ,ప్రతిసారి కలవడం కుదరడం లేదు. అంతే కానీ మరొక కారణం లేదు. మేము ఎప్పటికీ కలిసే ఉంటామని ఆయన వెల్లడించారు.
ఇక చిరంజీవి అనే వటవృక్షం క్రింద పలువురు హీరోలు, స్టార్స్ పుట్టుకొచ్చారు. మెగా ఫ్యామిలీ స్టార్ హీరోల కర్మాగారంగా తయారైంది. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఆ ఫ్యామిలీ నుండి స్టార్స్ గా అవతరించారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ టైర్ టు హీరోల జాబితాలో చేరారు. శిరీష్, వైష్ణవ్ తేజ్ లతో కలిపి అరడజనుకు పైగా హీరోలు ఆ ఫ్యామిలీ నుండి ఉన్నారు. పరిశ్రమలో మరికొన్ని పెద్ద కుటుంబాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వారసులు హీరోలుగా సక్సెస్ కాలేకపోయారు.