https://oktelugu.com/

Uday Kiran- Chiranjeevi And Venkatesh: అప్పటి ముచ్చట్లు : ఉదయ్ కిరణ్ సినిమాకు భయపడిన చిరంజీవి, వెంకటేష్..!

Uday Kiran- Chiranjeevi And Venkatesh: 2000 నాటి కాలంలో లవ్ చిత్రాలు బాగా సక్సెస్ అయ్యేవి. ఇలాంటి సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ కు లవర్ బాయ్ అన్న పేరు వచ్చింది. తేజ డైరెక్షన్లో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సమయంలో వరుస హిట్లు కొట్టాడు. ఈయన దూకుడు చూసి స్టార్ హీరోలు సైతం షాక్ తిన్నారు. ఒకానొక దశలో ఉదయ్ కిరణ్ స్టార్ ఇమేజ్ కు ఎవరూ తట్టుకోలేరు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 14, 2023 / 01:04 PM IST
    Follow us on

    Uday Kiran- Chiranjeevi And Venkatesh

    Uday Kiran- Chiranjeevi And Venkatesh: 2000 నాటి కాలంలో లవ్ చిత్రాలు బాగా సక్సెస్ అయ్యేవి. ఇలాంటి సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ కు లవర్ బాయ్ అన్న పేరు వచ్చింది. తేజ డైరెక్షన్లో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సమయంలో వరుస హిట్లు కొట్టాడు. ఈయన దూకుడు చూసి స్టార్ హీరోలు సైతం షాక్ తిన్నారు. ఒకానొక దశలో ఉదయ్ కిరణ్ స్టార్ ఇమేజ్ కు ఎవరూ తట్టుకోలేరు అన్న ప్రచారం సాగింది. అయితే ఆయన నటించిన ‘మనసంతా నువ్వే’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ సమయంలో జగిగిన ఓ సంఘటన గురించి ఇండస్ట్రీలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

    ఎంఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘మనసంతా నువ్వే’ లవ్ ఎమోషనల్ హిట్టు మూవీ. ఇందులో ఉదయ్ కిరణ్, రీమాసేన్ నటించారు. సునీల్ కామెడీ బాగా ఆకట్టుకుంటోంది. ఓ చిన్న స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథ బాగుండడంతో పాటు పాటలు బాగా హిట్టయ్యాయి. క్యారెక్టరైజేషన్ కూడా బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతకుముందు రెండు సక్సెస్ సినిమాల తరువాత ఉదయ్ కిరణ్ కు ఇది కూడా విజయం సాధించడంతో ఆయన హ్యాట్రిక్ హీరో అని పేర్కొన్నారు.

    Uday Kiran- Chiranjeevi And Venkatesh

    ‘మనసంతా నువ్వే’ సినిమాను ముందుగా 2001 సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అప్పటికే వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 6న ఫిక్స్ చేశారు. దీంతో మనసంతా నువ్వె సినిమా రిలీజ్ ను రెండు వారాలు వెనక్కి జరపాలని ఆ చిత్ర నిర్మాత కోరాడట. అప్పటికే దేవిపుత్రుడు, ప్రేమతో రా సినిమాలు ప్లాప్ కావడంతో వెంకీకీ ఈ సినిమా సక్సెస్ ఇవ్వాలని నిర్మాత అభిప్రాయం. అయితే అలా చేస్తే మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాకు క్లాష్ అవుతుంది. ‘డాడీ’ సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ తేదీని నిర్ణయించారు.

    ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే హిట్టయితే చిరంజీవి ‘డాడీ’ సినిమాకు ఇబ్బంది అవుతుందని ఆలోచించి మరో రెండు వారాలు వాయిదా వేశాడట ఎంఎస్ రాజు. అలా డాడీ సినిమా రిలీజ్ అయిన తరువాత మనసంతా నువ్వేను రిలీజ్ చేశారు. అనుకున్నట్లే డాడీ సినిమా కంటే మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ నిలిచింది. వసూళ్ల పరంగా కూడా మనసంతా నువ్వే సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.