Chiranjeevi – Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే..చాలా కాలం తర్వాత మెగాస్టార్ నుండి వస్తున్న ఊర మాస్ సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో మరియు ట్రేడ్ లో మామూలు అంచనాలు లేవు..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసింది.

ఇక నిన్న విడుదలైన టైటిల్ సాంగ్ కి అయితే సోషల్ మీడియా ని ఊపేస్తోంది..ఇప్పటికే ‘బాస్ పార్టీ’ సాంగ్ సోషల్ మీడియా మరియు మాస్ ఆడియన్స్ లో ఒక రేంజ్ లో క్లిక్ అయ్యింది..ఈ సాంగ్ ఇప్పుడు థియేటర్స్ లో కూడా ప్రదర్శింపబడుతోంది..అలాంటి సెన్సేషనల్ హిట్ సాంగ్ తర్వాత టైటిల్ సాంగ్ కూడా క్లిక్ అవ్వడం మెగా ఫ్యాన్స్ కి మామూలు జోష్ ఇవ్వలేదు.
ఇది ఈ సినిమాకి సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిరంజీవి మరియు రవితేజ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు..ఈ ప్రెస్ మీట్ లో వాల్తేరు వీరయ్య కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు చెప్పబోతున్నారు..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో వచ్చే నెల నాల్గవ తారీఖున ఘనంగా జరపబోతున్నారని తెలుస్తుంది..ఈ ఈవెంట్ కోసం రాష్ట్రం నలుమూలల నుండి ప్రత్యేక రైళ్లు కూడా నడపబోతున్నారట.

అంతే కాకుండా ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని..ఇందుకోసం మూవీ టీం ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది..ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా నాల్గవ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..ఇక మెగా ఫ్యాన్స్ కి ఈ వీక్ మొత్తం పండగే అన్నమాట.