
Ram Charan : మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొని అమెరికాలో సందడి చేసి ఇండియాకు వచ్చారు. అయితే అందరూ రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు ఈ తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగా.. రాంచరణ్ మాత్రం ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నాడు.
గత కొద్దిరోజులుగా రాంచరణ్ ఆస్కార్ వేడుకలు, ప్రమోషన్స్ కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉంటున్నాడు. తన సతీమణి ఉపాసన గర్భవతి కావడంతో వీరు ప్రత్యేకంగా ఓ లగ్జరీ ఇంటిని అద్దెకు తీసుకొని మరీ అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
I thank all the fans and people from #India for watching #RRR & making the “#NaatuNaatu” song a superhit.
Naatu Naatu was not our song it was the song of the people of India.@AlwaysRamCharan #RamCharan@upasanakonidela#GlobalStarRamCharan #Oscarshttps://t.co/ZVcqlPdq16
— John Wick (@JohnWick_fb) March 17, 2023
అయితే ఆస్కార్ వేడుకలు అయిపోవడంతో హైదరాబాద్ కు ఆర్ఆర్ఆర్ టీం రాగా.. రాంచరణ్ మాత్రం ఢిల్లీకి చేరుకున్నాడు. రాంచరణ్ కు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్’ అంటూ నినాదాలు చేశారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
ఇక ఢిల్లీ ఎయిర్ పోర్టులో రాంచరణ్ మీడియాతో మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటను సూపర్ హిట్ చేసి ఆస్కార్ అవార్డు లభించేలా చేసిన ప్రతీ భారతీయ సినీ ప్రియుడికి, నా అభిమానులకు ధన్యవాదాలు. నాటు నాటు మా ఒక్కరి పాట మాత్రమే కాదు.. ఇది మీ అందరి పాట. దేశ ప్రజలే దీన్ని ఆస్కార్ కు తీసుకెళ్లారు’ అని రాంచరణ్ గర్వంగా చెప్పాడు.
#GlobalStar @AlwaysRamCharan garu received a grand welcome at Delhi airport from the Media/Friends/Fans and well wishers #GlobalstarRamcharan #RamCharan pic.twitter.com/uSINjAPUMX
— SivaCherry (@sivacherry9) March 17, 2023
ఇక హైదరాబాద్ కు రాకుండా ఢిల్లీలో రాంచరణ్ దిగడానికి కారణముంది. చరణ్ సైతం హైదరాబాద్ రావాల్సి ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం సపరేట్ గా ఢిల్లీకి చేరుకున్నాడు. ప్రధాని మోడీ కోరిక మేరకు పలు కార్యక్రమాల్లో రాంచరణ్ పాల్గొననున్నాడు. ఈరోజు కార్యక్రమాలు పూర్తయ్యాక ఢిల్లీలోనే రాత్రి ఉండి రేపు హైదరాబాద్ కు రాంచరణ్ రానున్నాడు.